...
...
Next Story

Cancer Yearly Horoscope: 2026లో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని లాభాలు.. అందమైన వైవాహిక జీవితం, శుభవార్తలు ఇలా ఎన్నో

2026లో కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది, ఏ సమస్యలు ఎదురవుతాయి, కెరీర్ పరంగా ఎలా ఉంటుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 13, 2025, 15:00:15 IST
Advertisement

2025 పూర్తి కాబోతోంది, 2026 రానుంది. 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది, ఏ సమస్యలు ఎదురవుతాయి, కెరీర్ పరంగా ఎలా ఉంటుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారి వార్షిక రాశిఫలాలు

Cancer Yearly Horoscope: 2026లో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని లాభాలు (pinterest)
Cancer Yearly Horoscope: 2026లో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని లాభాలు (pinterest)

2026లో కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి, ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది, సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. ప్రేమ జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక పూర్తి వార్షిక రాశి ఫలాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారి ఆర్థిక ఫలితాలు

2026లో కర్కాటక రాశి వారికి ఆర్థికపరంగా బాగుంటుంది. ఖర్చులు కొంచెం ఎక్కువైనా ఆర్థికపరంగా సమస్యలు ఉండవు. కొత్త సంవత్సరం మధ్యలో ఆర్థికపరంగా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. భూములు, బిల్డింగ్లు, వాహనాలు కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు.

బిజినెస్ రాశి ఫలాలు

2026లో వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. మే నుంచి ఆగస్టు వరకు సమయం బాగుంటుంది. కొత్త ప్లాన్లు విజయవంతంగా పూర్తి అవుతాయి. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.

కుటుంబ జీవితం

కర్కాటక రాశి వారికి 2026లో ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మార్చి, సెప్టెంబర్ నెలల్లో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉదర సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేలికపాటి ఆహారం తీసుకోండి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. యోగా, మెడిటేషన్ చేస్తే ప్రశాంతత లభిస్తుంది.

ప్రేమ రాశి ఫలాలు

2026లో కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామి భావాలను బాగా అర్థం చేసుకుంటారు.

విద్య ఫలితాలు

కర్కాటక రాశి వారికి 2026లో చదువుపరంగా బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు శుభవార్తలు వింటారు. సైన్స్, మెడిసిన్, అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది.

ప్రయాణాలు

సంవత్సరం మధ్యలో దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలకు కుటుంబంతో వెళ్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది.

పరిహారాలు

కర్కాటక రాశి వారు శివుడిని ఆరాధించడం మంచిది. నీటిని సమర్పించండి. ముత్యాలను ధరిస్తే చంద్రుడి నుంచి ప్రశాంతత లభిస్తుంది. “ఓం సోమాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత పొందవచ్చు

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe