...
...
Next Story

చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటిస్తే.. జీవితంలో డబ్బు, గౌరవం రెండూ మీ సొంతం!

ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవిత సూత్రాలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నిజమైన సంపద అంటే ఏమిటి? విజయాన్ని ఎలా సాధించాలి? కష్టకాలంలో ఎలా నిలబడాలి? మంచి వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? వంటి కీలక విషయాలపై చాణక్య నీతి చెప్పిన అమూల్యమైన బోధనలు తెలుసుకోండి.

Published on: Jul 6, 2026, 14:01:06 IST
Advertisement

జీవితంలో ఆర్థికంగా ఎదగాలన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడాలన్నా చాణక్య నీతిని మించిన మార్గదర్శి లేరు. నేటికీ ప్రాసంగికంగా ఉండే ఆయన అమూల్యమైన సూత్రాలు మనల్ని విజయపథం వైపు నడిపిస్తాయి.

చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటిస్తే.. జీవితంలో డబ్బు, గౌరవం రెండూ మీ సొంతం!
చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటిస్తే.. జీవితంలో డబ్బు, గౌరవం రెండూ మీ సొంతం!

మానవ జీవితంలోని ప్రతి మలుపులోనూ ఆచార్య చాణక్యుడు చూపిన మార్గం వెలుగునిస్తుంది. ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఉన్న ధనాన్ని కాపాడుకోవడం, కష్టాల్లో కూడా క్రమశిక్షణతో వ్యవహరించడం మరొక ఎత్తు. చాణక్య నీతి శాస్త్రం బోధించే కొన్ని కీలక పాఠాలు ఇప్పుడు చూద్దాం.

అసలైన సంపద ఏది?

చాణక్యుడి ప్రకారం, కేవలం జేబులో డబ్బు ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడు అనిపించుకోడు. ఎవరి దగ్గర విద్య అనే సంపద ఉంటుందో, వారే నిజమైన ఐశ్వర్యవంతులు. ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోయినా, జ్ఞానం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. కానీ విద్య లేని వ్యక్తి ప్రపంచంలో ఎంత సంపద ఉన్నా పేదవాడితో సమానం. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సరైన విచక్షణ, విద్య లేని వ్యక్తి ధనాన్ని సంపాదించడమే కాకుండా, ఉన్నదాన్ని కూడా కాపాడుకోలేక చేజార్చుకుంటాడు.

సొంత కృషే విజయానికి రహస్యం

ప్రతి పనిని ఇతరులపై ఆధారపడకుండా, స్వయంగా చేసుకోవడం వల్లే అత్యున్నత ఫలితాలు వస్తాయి. తాను సొంతంగా అల్లిన మాల, తానే అరగదీసిన గంధం, తన చేత్తో రాసిన స్తోత్రం దేవేంద్రుడికి కూడా గర్వాన్ని కలిగించే ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అంటే, భగవంతుడి ఆశీస్సులు పొందాలన్నా, లౌకిక విజయాలు సాధించాలన్నా కష్టం మీదే అయి ఉండాలి. ఇతరుల సహాయం కోసం ఎదురుచూసేవారు విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు.

గుణమే అసలైన సౌందర్యం

మనిషి కష్టాల్లో ఉన్నా, దారిద్య్రంలో ఉన్నా ధైర్యం కోల్పోకూడదు. ఎందుకంటే, ఆ ధైర్యమే ఆ కష్టాలను జయించేలా చేస్తుంది. సింపుల్ గా వస్త్రాలు కట్టుకున్నా అవి శుభ్రంగా ఉంటే రాజసం ఉట్టిపడుతుంది. సాధారణమైన ఆహారం అయినా వేడిగా, రుచిగా వడ్డించుకుంటే అమృతంలా అనిపిస్తుంది. ఒక వ్యక్తి రూపం ఎలా ఉన్నా, వారి ప్రవర్తన బాగుంటే అందరూ వారిని గౌరవిస్తారు. బాహ్య సౌందర్యం కంటే వ్యక్తిత్వంలోని గుణాలే మనిషికి గుర్తింపునిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks