జీవితంలో ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలు, విజయాలను కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మనిషి జీవితాన్ని సులభతరం చేసేందుకు, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అమూల్యమైన సూత్రాలను అందించారు. నేటి ఆధునిక కాలంలోనూ ఆయన చెప్పిన జీవన సూత్రాలు ఎంతో ఆచరణీయంగా నిలుస్తున్నాయి. మనిషి జీవితంలో అత్యంత వేదనను మిగిల్చే మూడు ప్రధాన పరిస్థితులను చాణక్యుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అజ్ఞానం లేదా మూఢత్వం తెచ్చే కష్టాలు

జ్ఞానం లేకపోవడం లేదా మూర్ఖంగా వ్యవహరించడం మనిషి జీవితంలో అతిపెద్ద శాపమని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. సమాచారం, సరైన అవగాహన లోపించినప్పుడు మనిషి అడుగులు తప్పుదారి పడతాయి. దీనివల్ల జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా, వ్యాపారంలో, బంధాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం కూడా అజ్ఞానమే అవుతుంది. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం మనిషి పతనానికి దారితీస్తుంది.
అదుపు తప్పుతున్న యవ్వనం
యవ్వన కాలం అనేది అంతులేని ఉత్సాహం, శక్తి సామర్థ్యాలతో కూడుకున్న సువర్ణావకాశం. అయితే ఈ దశలో విచక్షణ, సంయమనం లేకపోతే జీవితం సర్వనాశనం అవుతుంది. కేవలం జోష్ తో ఆలోచించకుండా అడుగులు వేస్తే యువత పెను ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంది. అందుకే యవ్వనంలో ఆవేశం కంటే ఆలోచన, సంయమనం ఎంతో ముఖ్యమని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది.
పరాయి ఇంట్లో బతకడం నరకప్రాయం
మూర్ఖత్వం, అదుపులేని యవ్వనం కష్టాలైనప్పటికీ, పరాధీన జీవితం లేదా మరొకరి ఇంట్లో ఆశ్రయం పొంది బతకడం వీటన్నింటికంటే అతి పెద్ద క్షోభ అని చాణక్యుడు తేల్చిచెప్పారు. సొంతిల్లు ఉండి కూడా పరిస్థితుల ప్రభావంతో పరాయి ఇళ్లలో తలదాచుకునేవారు స్వేచ్ఛగా జీవించలేరు.
నిత్యం ఏదో ఒక భయం, మానసిక ఒత్తిడి వారిని వెంటాడుతుంటాయి. ఎదుటివారి అభిరుచులు, పరిస్థితులకు తలవొగ్గి బతకాల్సి రావడం వల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. అందుకే సొంతడగు నీడ లేకపోవడమే మనిషికి అసలైన పెద్ద కష్టమని చాణక్యుడు వివరించారు.
{{/usCountry}}నిత్యం ఏదో ఒక భయం, మానసిక ఒత్తిడి వారిని వెంటాడుతుంటాయి. ఎదుటివారి అభిరుచులు, పరిస్థితులకు తలవొగ్గి బతకాల్సి రావడం వల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. అందుకే సొంతడగు నీడ లేకపోవడమే మనిషికి అసలైన పెద్ద కష్టమని చాణక్యుడు వివరించారు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పుకోము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.