Chanakya Niti: ధనం, కుటుంబం, ప్రాణం.. ఆపదలో ఏది ముఖ్యం? చాణక్య నీతిలో సమాధానం
జీవితంలో ఆపద ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఏది ముందుగా కాపాడుకోవాలి? ధనమా, కుటుంబమా, లేక ప్రాణమా? అనే ప్రశ్నకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
ఆపద సమయం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కష్టకాలంలో విచక్షణతో వ్యవహరించి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిన వ్యక్తి మాత్రమే విజేతగా నిలుస్తాడు. ఆపదలో ధనం, కుటుంబం, ప్రాణం.. ఈ మూడింటిలో దేనిని ముందుగా కాపాడుకోవాలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు.

ఆపద కాలానికి ధన సంపాదన
"ఆపదర్థే ధనం రక్షేత్" అని చాణక్యుడు హెచ్చరించారు. అంటే, భవిష్యత్తులో వచ్చే ఆపదలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ధనవంతులుగా ఉన్నప్పుడు కష్టాలు రావు కదా అని అశ్రద్ధ చేయకూడదు. లక్ష్మీదేవి చంచలమైనది, ఆమె ఒక్క చోట స్థిరంగా ఉండదు. ఎంతటి సంపద ఉన్నా, సమయం కలిసి రానప్పుడు అది కరిగిపోతుంది. కాబట్టి, అత్యవసర పరిస్థితుల కోసం తగినంత ధనాన్ని నిల్వ ఉంచుకోవడం తెలివైన వారి లక్షణం.
ధనం కంటే కుటుంబమే మిన్న
చాణక్య నీతి ప్రకారం, ఒకవేళ కుటుంబానికి లేదా ప్రియతములైన వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ధనాన్ని వెనుకాడకుండా ఖర్చు చేయాలి. "దారాన్ రక్షేద్ధనైరపి" అంటే, ధనం కంటే కుటుంబ సభ్యుల రక్షణ అత్యంత ముఖ్యమని అర్థం. సంపద పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ కుటుంబంలోని ఆప్యాయతలను, బంధాలను డబ్బుతో కొనలేము. ఆపదలో కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రాణ రక్షణే సర్వోపరి
అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మ రక్షణ. "ఆత్మానం సతతం రక్షేత్" అని చాణక్యుడు స్పష్టం చేశారు. ఒకవేళ పరిస్థితి విషమించి, ప్రాణాలకే ముప్పు వాటిల్లినప్పుడు ధనాన్ని, కుటుంబాన్ని కూడా పణంగా పెట్టి అయినా సరే, ముందుగా తన ప్రాణాలను కాపాడుకోవాలి. "ప్రాణం ఉంటేనే లోకం" అనే సామెత దీనికి సరిగ్గా సరిపోతుంది. ప్రాణం ఉంటేనే కుటుంబానికి భరోసా ఇవ్వగలం, ధనాన్ని తిరిగి సంపాదించగలం.
గమనించాల్సిన విషయం
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సంపద చంచలమైనది, సమయం మారుతూ ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రం మనకు కేవలం ఆపద సమయంలోనే కాకుండా, సాధారణ జీవితంలో కూడా దేనిని ఎప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఉంచాలో నేర్పుతుంది. బాధ్యతాయుతమైన జీవనానికి పొదుపు ఎంత అవసరమో బంధాల విలువ తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం.
ఆపద కాలంలో ధనాన్ని ఎందుకు దాచుకోవాలి?
కష్టాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి, క్లిష్ట సమయాల్లో ఎవరి దగ్గరకు చేయి చాచకుండా ఉండటానికి ధన సంపద అవసరం.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


