సమాజంలో మనం కలిసే ప్రతీ ఒక్కరూ శ్రేయోభిలాషులుగా ఉండాలని లేదు. ముఖ్యంగా బంధువర్గంలో కొందరు పైకి ఎంతో ఆప్యాయంగా పలకరించినట్లు కనిపిస్తారు. కానీ, అంతర్గతంగా మన బలహీనతలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. సంపాదన ఎంత?, ఇంట్లో సమస్యలేంటి?, పిల్లలు చదువులో ఎలాంటి మార్కులు తెచ్చుకుంటున్నారు? వంటి వివరాలను ఆరా తీసి, తద్వారా వాటిని మనకు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తుంటారు.

ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పినట్లుగా, కష్టకాలంలో బయటి శత్రువుల కంటే స్వంత మనుషుల వల్లే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మనవారితో వ్యవహరించేటప్పుడు ఎప్పుడూ ఒక అప్రమత్తత అవసరం.
సమాచారాన్ని తగ్గించండి.. భద్రతను పెంచండి
ఈ తరహా ఈర్ష్య పడే బంధువులు మన జీవితంలోని ప్రతీ చిన్న విషాదాన్ని లేదా సమస్యను ఒక ఆయుధంలా మలుచుకుంటారు. మన సమస్యను వారి ముందు ఏకరువు పెట్టామంటే, వారికి మనమే స్వయంగా ఆయుధాన్ని అందించినట్లవుతుంది.
అందుకే ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మానేయాలి. ఎవరైనా మీ సంపాదన గురించో, ఇబ్బందుల గురించో అడిగితే.. "దేవుడి దయ వల్ల అన్నీ సజావుగా సాగుతున్నాయి" అని క్లుప్తంగా ముగించండి. సమాచారం ఎంత తక్కువగా ఇస్తే, మీ జీవితం అంత సురక్షితంగా ఉంటుంది.
మౌనమే అతిపెద్ద సమాధానం
ఎవరైనా మీకు వ్యంగ్యంగా మాట్లాడినా లేదా అందరిలోనూ చిన్నచూపు చూసే ప్రయత్నం చేసినా, వెంటనే ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించండి. అలాంటి ఈర్ష్యపరులకు మీ నిజం తెలుసుకోవడం కంటే మీ అసహనం, ఆవేశం కావాలి. మీరు కేవలం చిరునవ్వుతో మౌనంగా ఉండిపోతే అదే వారికి అతిపెద్ద ఓటమి అవుతుంది. అనవసర వాదనలకు దిగడం వల్ల వారి కడుపుమంట మరింత పెరుగుతుంది తప్ప ఒరిగేదేమీ లేదు. సంక్షోభ సమయంలో బుద్ధిమంతులు సంయమనంతో ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నారు.
వినయంతోనే సమస్యలకు చెక్
కొన్ని సందర్భాల్లో మితిమీరిన వినయమే బలమైన సమాధానం అవుతుంది. నలుగురిలో ఎవరైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే, అత్యంత గౌరవప్రదంగా బదులివ్వండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచుతుంది. పైగా అవతలి వ్యక్తి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడేలా చేస్తుంది. "మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు" అంటూ తేలికగా తీసుకుంటే వారి దురుద్దేశం నీరుగారిపోతుంది. ఎలాంటి గొడవలకు తావులేకుండా ఈ పద్ధతిలో పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు.
లక్ష్య సాధన నిశ్శబ్దంగా ఉండాలి
{{/usCountry}}కొన్ని సందర్భాల్లో మితిమీరిన వినయమే బలమైన సమాధానం అవుతుంది. నలుగురిలో ఎవరైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే, అత్యంత గౌరవప్రదంగా బదులివ్వండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచుతుంది. పైగా అవతలి వ్యక్తి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడేలా చేస్తుంది. "మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు" అంటూ తేలికగా తీసుకుంటే వారి దురుద్దేశం నీరుగారిపోతుంది. ఎలాంటి గొడవలకు తావులేకుండా ఈ పద్ధతిలో పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు.
లక్ష్య సాధన నిశ్శబ్దంగా ఉండాలి
{{/usCountry}}మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా గోల్స్ ఎవరికీ ముందే చెప్పకండి. ఎవరికీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూపోతే, మీ విజయమే సమాధానం చెబుతుంది. ఈర్ష్యపరులు మీ ప్లాన్స్ ముందుగానే తెలుసుకుని మీ దారిలో అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది.
అందుకే అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండకండి. ఫోన్ కాల్స్ వెంటనే లిఫ్ట్ చేయకపోవడం, ప్రతీ ఆహ్వానానికి వెళ్లకపోవడం ద్వారా మీ విలువను పెంచుకోవచ్చు. అవసరమైనప్పుడు నిస్సందేహంగా గట్టిగా మాట్లాడటం కూడా నేర్చుకోవాలి.