...
...
Next Story

Chanakya Niti : నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలి? ఈ 6 లక్షణాలు ఉన్నాయో చూడండి

Chanakya Niti : ఈ కాలంలో నిజమైన స్నేహితులను గుర్తించడం కష్టంగా అయిపోయింది. ఎవరు ఫేక్ అని అర్థం కావడం లేదు. చాణక్యుడు నిజమైన స్నేహితులను గుర్తించడానికి కొన్ని సలహాలు ఇచ్చాడు.

Published on: May 9, 2026, 15:05:20 IST
Advertisement

మీరు కూడా ఒక మంచి, నిజమైన స్నేహితుడిని గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటే.. చాణక్యుని కొన్ని సూత్రాలు మీకు సహాయపడవచ్చు. కొన్ని గుణాలు ఉన్న స్నేహితుడు కష్ట సమయాల్లో కూడా తన సహచరునికి నీడలా అండగా నిలుస్తాడని చాణక్యుడు అంటాడు. నిజమైన ఫ్రెండ్ స్నేహానికి ఉన్న పరిమితులను అర్థం చేసుకుని, ఏమాత్రం స్వార్థం లేకుండా ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తాడు. ఆచార్య చాణక్యుడు ఒక నిజమైన, మంచి స్నేహితునికి ఉండవలసిన కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు. ఒకవేళ మీరు కూడా ఒక మంచి, నిజమైన స్నేహితుని గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటే.. చాణక్యుని కొన్ని సూత్రాలు మీకు సహాయపడవచ్చు.

కష్ట సమయాల్లో తోడుగా నిలబడటం

చాణక్య నీతి
చాణక్య నీతి

నిజమైన మనిషికి అసలైన పరీక్ష సంక్షోభ సమయాల్లోనే తెలుస్తుంది. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు.. తన బాధ్యతల నుండి పారిపోడు. సమస్యల నుండి పారిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. అది పని ఒత్తిడి అయినా, వ్యక్తిగత సమస్యలైనా, అతను సమతుల్యతను పాటిస్తూ తన ఫ్రెండ్‌ను ఎన్నడూ విడిచిపెట్టడు. అందువల్ల కష్ట సమయాల్లో కూడా మనకు అండగా నిలబడే వారితో స్నేహం చేయాలని చాణక్యుడు చెప్పాడు.

లోపాలను దాచుకోరు

మంచి స్నేహితుడు అంటే సీక్రెట్స్ మెయింటెన్ చేయరు. భావాలను అంగీకరిస్తారు. తన లోపాలను దాచుకోకుండా, వాటిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిజమైన స్నేహితుడు మౌనం, సంభాషణ రెండింటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాడు. అందుకే తన స్నేహితుడి భావాలను విస్మరించరు. స్నేహితుడి లోపాలను కూడా భయం లేకుండా చెప్పేస్తారు.

చెప్పిందంటే చేస్తాడు

ప్రపంచంలో వాగ్దానాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ వాటిని నిలబెట్టుకునేవారు చాలా తక్కువ. చాణక్య నీతి ప్రకారం, కేవలం తనను తాను పొగుడుకునే లేదా నిరంతరం తన గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తిని నమ్మడం కష్టం. మాటలకు, చేతలకు పొంతన ఉండే వ్యక్తే నమ్మదగిన వ్యక్తి. వారు కేవలం గొప్పలు చెప్పడం కాకుండా, చేతలతో చేసి చూపించడంలో నమ్మకం ఉంచుతారు. నిజమైన స్నేహితుడు మీకోసం ఏదైనా చెప్పిందంటే చేస్తారు.

బాధ్యత తీసుకుంటారు

చాణక్య నీతి ప్రకారం, కేవలం సుఖాలను అనుభవించడం వివేకం కాదు. ఆచార్య చాణక్యుని ప్రకారం, వివేకవంతుడు మాత్రమే మంచి స్నేహితుడు కాగలడు. అంతేకాకుండా తన భవిష్యత్ లక్ష్యాల పట్ల స్పష్టత ఉన్న వ్యక్తితో స్నేహం చేయడం వివేకం. అటువంటి వ్యక్తుల సాంగత్యం భవిష్యత్తులో ప్రయోజనకరమని చాణక్యుడు అంటాడు.

నిజాయితీ

చాణక్య నీతి ప్రకారం, నిజాయితీ అనేది ఏ వ్యక్తికైనా గొప్ప సద్గుణం. అతను మోసం లేదా నటన ఆధారంగా సంబంధాలను ఏర్పరచుకోడు. నిజమైన స్నేహితుడి ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఇతరుల సమయాన్ని, భావాలను ఎలా గౌరవించాలో వారికి తెలుసు. ఆత్మనిగ్రహం, ఇతరుల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తనే నిజమైన వ్యక్తిత్వం. అందుకే అటువంటి గుణాలు ఉన్నవారితో స్నేహం చేయమని చాణక్యుడు సలహా చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe