...
...
Next Story

జీవితంలో విజయానికి అతిపెద్ద శత్రువులు ఇవే.. చాణక్య నీతి ఏం చెబుతోంది?

ఆచార్య చాణక్య ప్రకారం విజయానికి కష్టపడటంతో పాటు ముందుచూపు, క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర అభ్యాసం చాలా అవసరం. రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి చర్యలు తీసుకునేవారు, సమస్య ఎదురైనప్పుడు తెలివిగా నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో అభివృద్ధి సాధిస్తారు.

Published on: Sep 6, 2026, 08:48:16 IST
Advertisement

సమస్య రాక ముందే అప్రమత్తం కావడం, అంకితభావంతో పనిచేయడమే విజయానికి అసలైన బాట అని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు. జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అయితే కొందరు ఎంత కష్టపడినా నిరాశే మిగులుతుంది. దీనికి కారణం మనలోని కొన్ని అలవాట్లేనని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. మనిషి విజయానికి అతడి ప్రవర్తనే అతిపెద్ద అడ్డంకిగా మారుతుందని చాణక్య హెచ్చరించారు.

ముందుచూపు లేకపోతే వినాశనమే

జీవితంలో విజయానికి అతిపెద్ద శత్రువులు ఇవే.. చాణక్య నీతి ఏం చెబుతోంది?
జీవితంలో విజయానికి అతిపెద్ద శత్రువులు ఇవే.. చాణక్య నీతి ఏం చెబుతోంది?

ఓ శ్లోకం ద్వారా చాణక్య అత్యంత కీలకమైన జీవన సత్యాన్ని వివరించారు. భవిష్యత్తులో రాబోయే ఆపదను ముందుగానే ఊహించి తగిన ముందస్తు చర్యలు తీసుకునేవారు, అలాగే ఆపద వచ్చిన క్షణంలోనే తన బుద్ధితో తక్షణ నిర్ణయాలు తీసుకునేవారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడి "జరిగింది ఏదో జరుగుతుందిలే" అని కాలం గడిపే అలసత్వపు మనుషుల పతనం కచ్చితంగా జరుగుతుందని చాణక్య పేర్కొన్నారు.

విజయానికి ప్రధాన అడ్డంకులు ఇవే

ఆలస్యం, పనులను వాయిదా వేయడం: ఏ పనైనా సరైన సమయంలో చేయకుండా వాయిదా వేసే స్వభావం ఉన్నవారికి విజయ అవకాశాలు దక్కవు. ఈ అలవాటు చేతికొచ్చిన అదృష్టాన్ని కూడా చేజార్చుతుంది.

కేవలం అదృష్టాన్ని నమ్ముకోవడం: కష్టపడకుండా ప్రతిక్షణం దైవం మీద లేదా అదృష్టం మీద భారం వేసి కూర్చోవడం సరైన పద్ధతి కాదు. మనిషి తన కర్తవ్యాన్ని మరచిపోకూడదు.

క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం: జీవితంలో ఒక నిర్దిష్టమైన గోల్ లేకపోవడం, రోజువారీ జీవితంలో క్రమశిక్షణ లోపించడం వల్ల ప్రయాణం గమ్యం చేరదు. నిరంతర ప్రయత్నం లేకుండా తీసుకునే ఏ సంకల్పమూ నెరవేరదు.

నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks