ఖగోళంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే ఆగస్టు 28, 2026 న ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం సావన్ పూర్ణిమ రోజున ఏర్పడటం విశేషం. జ్యోతిష్య నిపుణుల ప్రకారం… చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, దీనికి ఆధ్యాత్మికంగా, మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని, అయినప్పటికీ ఇది మానవ జీవితంపై, ద్వాదశ రాశులపై తనదైన ప్రభావం చూపుతుందని ప్రముఖ పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. సాధారణంగా గ్రహణం అనేది ఒక ప్రతికూల సంఘటనగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో ఏర్పడే శక్తి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దీని ప్రభావం మరింత అరిష్టంగా మారే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28న ఉదయం 08:04 గంటలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 09:43 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుని, ఉదయం 11:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి…. దీనికి సంబంధించి ఎలాంటి సూతక్ కాలం లేదా నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, గ్రహణ ప్రభావం వల్ల మొత్తం 12 రాశుల వారి జాతకాలపై మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ఆరు రాశుల వారు తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- మేష రాశి : ఈ రాశి వారిపై ఈ గ్రహణం అశుభ ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీ మానసిక ప్రశాంతత దెబ్బతినవచ్చు. తెలియని భయం, చంచలత్వం మిమ్మల్ని వెంటాడతాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు, పిల్లల విషయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
- మిథున రాశి: మిథున రాశి వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆదాయం తగ్గడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. పనికిరాని చింతలు, అనవసర ఆలోచనలతో మనస్సు కలవరపడుతుంది.
- సింహ రాశి : ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు. మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
- కన్యా రాశి : కన్యా రాశి వారు ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించకూడదు. బయటి వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. తొందరపాటుతో ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులు, ఆప్తుల మద్దతు లభించక ఇబ్బంది పడతారు.
- ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఆదాయ మార్గాల్లో మార్పులు, హెచ్చుతగ్గులు ఉంటాయి. సమాజంలో ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రవర్తన, మాట తీరుపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ బంధాలలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
- కుంభ రాశి : కుంభ రాశి వారి వైవాహిక జీవితంలో కలతలు రేగవచ్చు. సంతానానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నందున డబ్బు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో ఎలాంటి పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. పనుల్లో ఆటంకాలు ఏర్పడి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతారు.