తులారాశిలో చంద్ర-శుక్రుల కలయిక - ఈ 3 రాశులవారికి యోగంతో ఆర్థిక లాభాలు!
అక్టోబర్ 11న తులారాశిలో చంద్రుడు, శుక్రుడు కలవనున్నారు. ఈ గ్రహాల సంయోగంతో ఏర్పడే కళాత్మక యోగంతో మేషం, తులా, కుంభ రాశుల వారికి విపరీతమైన ధనలాభం, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెల గ్రహాల కదలికల పరంగా ఎంతో కీలకమైన మార్పులకు వేదిక కానుంది. ఈ క్రమంలో అక్టోబర్ 11వ తేదీన చంద్రభగవానుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో సౌందర్యానికి, వైభవానికి కారకుడైన శుక్రగ్రహం సంచరిస్తోంది. ఒకే రాశిలో ఈ రెండు శుభగ్రహాలు కలవడంతో జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే 'కళాత్మక యోగం' రూపుదిద్దుకోనుంది.

నవగ్రహాలలో చంద్రుడిని మనస్సుకు, భావోద్వేగాలకు సంకేతంగా పరిగణిస్తే.. శుక్రుడిని సంపద, భౌతిక సుఖాలు, కళలు, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండింటి సంయోగం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అక్టోబర్ 11 ఉదయం 11:05 గంటలకు చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో ఈ యోగం ప్రారంభమై, అక్టోబర్ 13 సాయంత్రం వరకు కొనసాగుతుంది. చంద్ర రాశి ఆధారంగా లెక్కిస్తే… ఈ కళాత్మక యోగం ముఖ్యంగా మేషం, తులా మరియు కుంభ రాశుల జాతకుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
మేష రాశి:
మేష రాశి జాతకులకు చంద్ర-శుక్రుల కలయిక వ్యాపార, ఉద్యోగ రంగాలలో విశేషమైన ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగార్థులకు సరికొత్త ఆఫర్లు అందుతాయి. వ్యాపారవేత్తలు భాగస్వామ్య ఒప్పందాల (పార్ట్‌నర్‌షిప్స్) ద్వారా ముందుకు సాగడానికి మార్గాలు సుగమమవుతాయి. పాత మిత్రులు లేదా పరిచయస్తుల ద్వారా ఊహించని వ్యాపార ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే, రాబడి పెంచుకోవడానికి నూతన మార్గాలు లభిస్తాయి. పూర్వం వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. అయితే, ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లాభనష్టాలను క్షుణ్ణంగా అంచనా వేయడం మంచిది.
తులా రాశి:
తులారాశిలోనే ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుండటంతో…. ఈ రాశి వారికి ఈ సంచారం అత్యంత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వంలో విశేషమైన ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో, పనిచేసే చోట మీ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతాయి. ఆఫీసులో మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు పెద్దపీట వేస్తారు. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతికి సంబంధించిన బాధ్యతలు దక్కే అవకాశముంది. వ్యాపారంలో ఉన్నవారు నూతన కస్టమర్లను ఆకర్షించడమే కాకుండా పెద్ద కాంట్రాక్టులు సాధిస్తారు. బకాయి పడిన పాత డబ్బు చేతికి అందడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ కళాత్మక యోగం అదృష్టాన్ని, కెరీర్ పరంగా గొప్ప ఊరటను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాల ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆదాయ వనరులను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు వంద శాతం ఫలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లేదా కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన, అనుకూల వాతావరణం నెలకొని సంతోషం వెల్లివిరుస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

