ఏడాదికి ఒక్కసారే వచ్చే చిలుక ద్వాదశి.. రేపు తులసి కోట దగ్గర ఈ 5 పనులు చేస్తే శుభ ఫలితాలు!

కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 21, శనివారం నాడు ఈ పవిత్రమైన పర్వదినం వచ్చింది. ఈ రోజున తులసి దేవిని శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తులసి కల్యాణం నిర్వహిస్తారు.

Published on: Nov 20, 2026, 16:00:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలోని 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం చేసి, శివ పూజలను నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశేషమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి కూడా ప్రత్యేకత ఉంది.

ఏడాదికి ఒక్కసారే వచ్చే చిలుక ద్వాదశి.. రేపు తులసి కోట దగ్గర ఈ 5 పనులు చేస్తే శుభ ఫలితాలు! (AI)
ఏడాదికి ఒక్కసారే వచ్చే చిలుక ద్వాదశి.. రేపు తులసి కోట దగ్గర ఈ 5 పనులు చేస్తే శుభ ఫలితాలు! (AI)

కార్తీక శుక్ల ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది చిలుక ద్వాదశి నవంబర్ 21, శనివారం నాడు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తులసి కల్యాణాన్ని కూడా జరుపుతారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. తులసి కోట దగ్గర ప్రత్యేక పూజలు చేయడం వలన సుఖసంతోషాలు కలుగుతాయి.

అసలు చిలుక ద్వాదశి అంటే ఏంటి?

కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశిని చిలుక ద్వాదశి అని అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు, కార్తీక ఏకాదశి నాడు మేలుకుంటారు. ఆ తర్వాత వచ్చిన ద్వాదశి రోజున తులసి దేవిని విష్ణు స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది. తులసి కల్యాణాన్ని కూడా నిర్వహిస్తారు.

తులసి కోట దగ్గర ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు

1.దీపారాధన:

తులసి కోట దగ్గర సాయంత్రం దీపారాధన చేయాలి. చాలామంది 27 దీపాలను వెలిగిస్తారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు. శ్రీహరిని స్మరిస్తూ ఇలా దీపారాధన చేయడం వలన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది.

2.తులసమ్మకు ప్రత్యేక పూజ:

తులసి మొక్కకు భక్తితో పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి ధూపదీపాలను సమర్పించాలి. తులసి అష్టోత్తర శతనామావళి చదవండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.

3.తులసి కల్యాణం:

తులసి దేవికి విష్ణువుతో లేదా కృష్ణుడితో కల్యాణం జరిపిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది.

4.ఉసిరి, తులసి ప్రాధాన్యత:

కార్తీక మాసంలో తులసితో పాటు ఉసిరి చెట్టుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఎంతో పుణ్యం వస్తుంది.

5.విష్ణు నామస్మరణ:

విష్ణు సహస్రనామం, శ్రీహరి స్తోత్రాలను చదువుతూ భజనలు చేయడం వలన చక్కటి ఫలితం కనిపిస్తుంది. తులసి కల్యాణం సమయంలో విష్ణుమూర్తి నామాలను స్మరించడం చాలా విశేషమైనది.

చిలుక ద్వాదశి నాడు దానధర్మాలు

రేపు వచ్చే చిలుక ద్వాదశి నాడు పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, పండ్లు దానం చేయడం మంచిది. అవసరమైన వారికి దానాలు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. భక్తితో చేసే చిన్న దానమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More