దీపాల పండగైన దీపావళి వచ్చిందంటే ఇళ్లన్నీ కాంతులతో కళకళలాడుతుంటాయి. ఈ పవిత్రమైన రాత్రి పూజా మందిరంలో లక్ష్మీ గణపతుల ఆరాధనతో పాటు సంప్రదాయంగా అఖండ దీపాన్ని వెలిగించే ఆచారం మనలో చాలా మంది పాటిస్తారు. సాయంత్రం ప్రారంభమైన ఈ దీపం తెల్లవారే వరకు నిరంతరం వెలుగుతూనే ఉండాలి.

దీన్ని అఖండ దీపంగా భావిస్తారు. ఈ నిరంతర జ్యోతి ఇంట్లోని చీకట్లను పారద్రోలడమే కాకుండా, కుటుంబంలో సుఖశాంతులు, సానుకూల శక్తిని నింపుతుందని ప్రగాఢ విశ్వాసం.
దీపంలో లవంగం, కర్పూరం ప్రత్యేకత
అఖండ దీపాన్ని మరింత విశేషంగా మార్చడానికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జోడించడం మన సంప్రదాయంలో ఉంది. పూజా సమయంలో దీపంలో ఒక లవంగాన్ని వేయడం చాలా శుభప్రదమని నమ్ముతారు. లవంగాన్ని భక్తికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. దీపావళి రాత్రి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ కుటుంబంపై ఉంటుందని నమ్ముతారు.
రాత్రంతా దీపం వెలుగుతూ ఉండాలంటే..
అఖండ దీపం రాత్రంతా ఎటువంటి అంతరాయం లేకుండా వెలగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఇందుకు చిన్న ప్రమిదలకు బదులుగా పెద్దదైన, లోతుగా ఉండే ఇత్తడి దీపాన్ని లేదా మట్టి ప్రమిద ఎంచుకోవాలి. అందులో సరిపడా నెయ్యి లేదా నూనె పోయాలి. అలాగే కాటన్ ఒత్తి కొద్దిగా మందంగా, పొడవుగా ఉండాలి. ఒత్తి కింది భాగం పూర్తిగా నూనెలో మునిగి ఉండేలా చూస్తేనే తెల్లవారే వరకు ఇంధనం అందుతూ జ్యోతి స్థిరంగా ప్రకాశిస్తుంది. దీపం వెలిగించే ముందే అది కదలకుండా సరిగ్గా నిలబడిందో లేదో పరీక్షించుకోవడం మంచిది.
భద్రతకు ప్రథమ ప్రాధాన్యం
రాత్రంతా వెలిగే ఈ అఖండ దీపం విషయంలో భద్రత అత్యంత కీలకం. గాలి ఎక్కువగా వీచే ప్రదేశాలలో దీపాలను ఉంచకూడదు. గాలికి జ్యోతి అస్థిరంగా మారి త్వరగా ఆరిపోయే అవకాశం ఉంది. అవసరమైతే గాజు చిమ్నీలను ఉపయోగించవచ్చు. అయితే చుట్టూ గాలి ఆడేలా తగినంత స్థలం ఉండాలి.
{{/usCountry}}రాత్రంతా వెలిగే ఈ అఖండ దీపం విషయంలో భద్రత అత్యంత కీలకం. గాలి ఎక్కువగా వీచే ప్రదేశాలలో దీపాలను ఉంచకూడదు. గాలికి జ్యోతి అస్థిరంగా మారి త్వరగా ఆరిపోయే అవకాశం ఉంది. అవసరమైతే గాజు చిమ్నీలను ఉపయోగించవచ్చు. అయితే చుట్టూ గాలి ఆడేలా తగినంత స్థలం ఉండాలి.
{{/usCountry}}ముఖ్యంగా పర్వదినాల్లో ఇంటి అలంకరణ కోసం వాడే పూలు, కాగితాలు వంటి సులభంగా మంటంటుకునే వస్తువులకు దీపానికి మధ్య సరైన దూరం ఉండేలా జాగ్రత్తపడాలి. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ప్రమిదలకు దూరంగా ఉండేలా చూసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. సంప్రదాయాలు ఎంత ముఖ్యమో, భద్రత కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.