Detailed Horoscope: ఈరోజు రాశి ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ రాశుల వారికి బంపర్ లాభాలు!
జూన్ 8 సోమవారం నాడు ద్వాదశ రాశుల జాతకం ఎలా ఉండబోతోంది? శివారాధన వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఈ రోజువారీ రాశిఫలాల్లో తెలుసుకోండి.
సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. జూన్ 8వ తేదీన గ్రహాల కదలికల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతకాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ రోజు భోళాశంకరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సంపద, ఐశ్వర్యం లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జ్యోతిష్య గణన ప్రకారం ఈ సోమవారం కొందరికి అద్భుత లాభాలను తెచ్చిపెడితే, మరికొందరికి సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. మేషం నుంచి మీనం వరకు రేపటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి
ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో ఉత్పాదకతతో సాగుతుంది. మీపై మీరు శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. కేవలం పనిలోనే మునిగిపోకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి సమయాన్ని కేటాయించడం మంచిది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, సంపాదన బాగుంటుంది.
వృషభ రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆఫీసులో కొందరు అదనపు సమయం పనిచేయాల్సి రావచ్చు. నిర్దేశిత సమయంలోగా పనులను పూర్తి చేయడం మంచిది. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. అనుకోని ఖర్చులు ఎదురై ఇబ్బంది పెడతాయి.
మిథున రాశి
ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. బయటి ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టండి. ధనలాభం కలిగే యోగాలు బలంగా ఉన్నాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా సాగుతుంది.
కర్కాటక రాశి
మీ ఆహారపు అలవాట్లపై ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కుటుంబంలోని ఒకరికి ఆర్థికంగా సహాయం చేయాల్సి రావచ్చు, దీనివల్ల మీ బడ్జెట్ కాస్త మారుతుంది. పని మీద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఫిట్‌నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.
సింహ రాశి
ఈ రోజు మీకు ఏదైనా ఒక మంచి వార్త అందుతుంది. ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన రోజిది. కెరీర్ పరంగా పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీ భుజాన పడతాయి.
కన్యా రాశి
ఆర్థిక జీవితం స్థిరంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. పని ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కాసేపు విరామం తీసుకోండి.
తులా రాశి
జంక్ ఫుడ్‌కు ఈ రోజు దూరంగా ఉండాలి. వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల మంచి ఆదాయం సమకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడం అవసరం.
వృశ్చిక రాశి
మీ మనసులోని భావాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం వల్ల బంధం బలపడుతుంది. మీ మంచి ప్రవర్తనే మీకు శ్రీరామరక్ష. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి, తగినంత నీరు తాగాలి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.
ధనుస్సు రాశి
మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటంతో పాటు ధనలాభం కలుగుతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. అనవసర ఒత్తిడికి గురికావద్దు, ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురాకండి. పనులపై శ్రద్ధ పెట్టండి.
మకర రాశి
మీ జీవితంలో ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చే సూచనలు ఉన్నాయి. కెరీర్ లో సమతుల్యత పాటించడం ముఖ్యం. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది.
కుంభ రాశి
ఉద్యోగ జీవితం ఈ రోజు కాస్త బిజీగా మారుతుంది. అయినప్పటికీ ఈ రోజు మీకు ప్రత్యేకంగా నిలుస్తుంది. సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు కాస్త వెనకా ముందూ ఆలోచించడం మంచిది.
మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజంతా సాధారణంగానే సాగిపోతుంది. పని ఒత్తిడిని తలకెక్కించుకోకండి, అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి. రోజువారీ వ్యాయామం లేదా అరగంట పాటు నడక మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య నిపుణులు, శాస్త్రాల ఆధారంగా సేకరించినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరిన్ని వివరాల కోసం సంబంధిత రంగ నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


