హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదిశి తిథిని అత్యంత పవిత్రమైన ధన త్రయోదశి జరుపుకుంటారు. లక్ష్మీదేవి పూజకు ప్రత్యేకమైన ఈ రోజున ఆయుర్వేద దేవుడు ధన్వంతరితో పాటు కుబేరుడు, మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఈ పండుగ రోజున బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రం ఆధారంగా కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా జాతకంలో గ్రహాలు బలపడటంతో పాటు సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈ ఏడాది నవంబర్ 6, శుక్రవారం నాడు ధన త్రయోదశి వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర దినాన ఏ రాశివారు ఎలాంటి వస్తువులు కొంటే శుభప్రదమో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి: ఈ రాశి వారు ధన త్రయోదశి రోజున ఎరుపు రంగు వస్తువులు, ధాన్యం లేదా స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయడం అత్యంత శుభాన్ని ఇస్తుంది.
వృషభ రాశి: వీరు తెలుపు రంగు వస్తువులు లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధిత సామగ్రిని ఇంటికి తెచ్చుకోవడం మంచిది.
మిథున రాశి: శ్రీ యంత్రం లేదా ఆకుపచ్చని రంగు వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు అందుకుంటారు.
కర్కాటక రాశి: తెల్లటి వస్తువులు, వెండి నాణేలు లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం లాభసాటిగా మారుతుంది.
సింహ రాశి: పసుపు రంగు వస్తువులు, బంగారం లేదా రాగితో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం జాతకంలో గ్రహ బలాన్ని పెంచుతుంది.
కన్య రాశి: పుస్తకాలు, వెండి లేదా రాగి పాత్రలను కొనుగోలు చేయడం ఈ రాశి వారికి శ్రేయస్కరం.
తులా రాశి: తెలుపు రంగు వస్తువులు, డైమండ్ లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఎంతో అదృష్టాన్ని తెస్తుంది.
వృశ్చిక రాశి: నూతన ఆస్తి, వాహనం లేదా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: ప్రమిదలు, ఇత్తడి పాత్రలు లేదా బంగారు నాణేలు కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
{{/usCountry}}ధనుస్సు రాశి: ప్రమిదలు, ఇత్తడి పాత్రలు లేదా బంగారు నాణేలు కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
{{/usCountry}}మకర రాశి: గృహోపకరణాలైన ఇత్తడి లేదా రాగి పాత్రలతో పాటు నూతన చీపురు కొనుగోలు చేయడం శుభప్రదం.
కుంభ రాశి: పూజా సామగ్రి, చీపురు, శ్రీయంత్రం లేదా కుబేర యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.
మీన రాశి: ఈ రోజున కొద్దిగా ధనియాలు, లక్ష్మీ-గణేశుల ప్రతిమలను కొనుగోలు చేయడం అత్యంత ఫలప్రదంగా ఉంటుంది.