...
...
Next Story

Dhanurmasam: ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు తేదీలతో పాటు ఈ నెలలో తప్పక పాటించాల్సినవి ఏవో తెలుసుకోండి!

Dhanurmasam: సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం.

Published on: Dec 3, 2025, 08:00:08 IST
Advertisement

ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం.

ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు వివరాలు:

Dhanurmasam: ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు వివరాలు (pinterest)
Dhanurmasam: ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు వివరాలు (pinterest)

ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16, మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14, అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11కు ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.

ధనుర్మాసంలో తప్పక పాటించాల్సినవి:

  • ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి.
  • అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది.
  • తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు.
  • విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని అంటారు.
  • ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది.

లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది

ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ధనుర్మాసం నెలరోజులు ప్రతి ఒక్కరూ ఇంటిముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు.

గోదాదేవి కళ్యాణం:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe