గ్రహాలు ఎప్పటికప్పుడు నక్షత్రాలను, రాశులను మారుస్తాయి. ఆ సమయంలో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 8న వచ్చింది. ఏడాదిలో అత్యంత ప్రత్యేకమైన పండుగగా దీపావళిని భావిస్తారు.

దీపావళి సంతోషాలు, సానుకూల మార్పులు, నూతన ప్రారంభాలను తీసుకొస్తుందని నమ్ముతారు. ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటాము. అయితే, దీపావళికి ముందు ధన త్రయోదశి వస్తుంది. దీపావళి వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.
దీపావళితో ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
దీపావళి వారం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మధ్య పలు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. మాళవ్య యోగం, విష్కుంభ యోగం, త్రిగ్రాహి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.
అలాగే బుధాదిత్య, శుక్రాదిత్య యోగాలు కూడా ఏర్పడతాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సమయంలో కొన్ని రాశుల వారు ధనలాభం, కెరీర్‌లో విజయాలను పొందుతారు. ధన త్రయోదశి నుంచి ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోందో చూసేద్దాం.
ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు ఈ రాశుల వారికి పండగే.. అనేక విధాలుగా లాభాలు!
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఇంటికి దూరంగా ఉంటున్న వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కొత్త ప్లాన్లు లేదా వ్యాపార అవకాశాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకువస్తాయి. కలలు నెరవేరుతాయి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లండి.
మేష రాశి:
మేష రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. విజయాలు, సంతోషాలను పొందుతారు. ఈ సమయంలో అన్ని రంగాల్లో శుభవార్తలను వింటారు. ఆర్థిక విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంది. జీవితంలో గొప్పగా ఎదగాలని అనుకుంటారు. పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
తులా రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కళారంగంలో బాగా రాణిస్తారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు.