తెలుగు లోగిళ్లలో పండుగ సంబరాలు మొదలయ్యాయి. వెలుగుల పండుగైన దీపావళికి ముస్తాబవుతున్నారు. ధన త్రయోదశి నుంచి ప్రారంభమయ్యే ఈ ఐదు రోజుల దీపావళి వేడుకల్లో ప్రధాన ఘట్టం లక్ష్మీ పూజ. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున మహా లక్ష్మిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

ఈ పవిత్ర దినాన సంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేక పూజలు, నోములు ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ప్రత్యేక రోజున ప్రతి ఒక్కరూ తమ రాశికి తగినట్లుగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దీపావళి పూజా ముహుర్తం ఎప్పుడంటే?
ఈ ఏడాది కార్తీక మాస అమావాస్య తిథి నవంబర్ 8న ఉదయం 11:27 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 9న మధ్యాహ్నం 12:31 నిమిషాల వరకు కొనసాగుతుంది. దీపావళి పండుగలో సాయంత్రం వేళ వచ్చే ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
ఈ నేపథ్యంలో నవంబర్ 8, 2026 నాడే ప్రదోష కాలంలో ఇళ్లలో దీపావళి లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించుకోవాలి. ఈ శుభ ముహుర్తాన భక్తితో చేసే పూజ విశేష ఫలితాలను ఇస్తుంది.
మేషం నుంచి మీనం వరకు.. ఎవరు ఏం చెయ్యాలి?
జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం, పన్నెండు రాశుల వారు దీపావళి రోజు చేయవలసిన ప్రత్యేక పూజా విధివిధానాలు ఇలా ఉన్నాయి:
మేష రాశి: మేష రాశి వారు దీపావళి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు వస్త్రంతో పాటు తాజా గులాబీ పూలను సమర్పించాలి.
{{/usCountry}}మేష రాశి: మేష రాశి వారు దీపావళి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు వస్త్రంతో పాటు తాజా గులాబీ పూలను సమర్పించాలి.
{{/usCountry}}వృషభ రాశి: వృషభ రాశి వారు సాయంత్రం వేళ లక్ష్మీదేవి మందిరం ఎదుట ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించుకోవాలి.
మిథున రాశి: మిథున రాశి జాతకులు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు, గులాబీ పూలను పూజలో అర్పించి విశేష ఆశీస్సులు పొందవచ్చు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు పదహారు రకాల అలంకరణ తల్లి లక్ష్మికి కానుకగా సమర్పించాలి.
సింహ రాశి: సింహ రాశి వారు అమ్మవారికి డ్రైఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి, భక్తితో తులసి చాలీసా పఠించాలి.
కన్యా రాశి: కన్యా రాశి వారు ఈ పవిత్ర దినాన 'శ్రీ లక్ష్మీ చాలీసా'ను భక్తిశ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు.
తులా రాశి: తులా రాశి వారు అమ్మవారికి మంచి సుగంధ ద్రవ్యం సమర్పించి, ఖీర్ నైవేద్యంగా పెట్టాలి.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు అమ్మవారి పూజలో ఎరుపు రంగు గాజులు, గులాబీ పూలను సమర్పించడం మంచిది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు దీపావళి రోజు 'శ్రీ సూక్తం' పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మకర రాశి: ఈ రాశి వారు లక్ష్మీదేవి ముందు ఐదు నెయ్యి దీపాలను వెలిగించి సంతోషకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి.
కుంభ రాశి: కుంభ రాశి వారు అమ్మవారికి సింధూరంతో కూడిన అలంకరణ వస్తువులను కానుకగా సమర్పించాలి.
మీన రాశి: మీన రాశి వారు దీపావళి రోజు లక్ష్మీదేవికి డ్రైఫ్రూట్స్‌తో చేసిన ప్రసాదాన్ని నివేదించాలి.