...
...
Next Story

దీపావళికి ముందే బీరువా దిశ మార్చాలా? డబ్బు, బంగారం విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించండి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బంగారం, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను సరైన దిశలో భద్రపరచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో బీరువా లేదా లాకర్‌ను ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తారు.

Published on: Nov 2, 2026, 14:01:01 IST
Advertisement

చాలామంది వాస్తు ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే వాస్తు నియమాలను అనుసరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. అయితే, ఇంట్లో దాచుకునే బంగారం, డబ్బు, వెండి వంటివి సరైన దిశలో పెట్టాలి. వాస్తు ప్రకారం వాటిని సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల శక్తి ఏర్పడుతుందని చెబుతారు.

దీపావళికి ముందే బీరువా దిశ మార్చాలా? డబ్బు, బంగారం విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించండి! (AI)
దీపావళికి ముందే బీరువా దిశ మార్చాలా? డబ్బు, బంగారం విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించండి! (AI)

ఇంట్లో విలువైన వస్తువులను బీరువా లేదా లాకర్‌లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే, వాటిని ఉంచే బీరువా లేదా లాకర్ సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడంతో పాటు బీరువా, ధనం, ఆభరణాలకు పూజలు చేసే సంప్రదాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

బీరువాను ఏ దిశలో ఉంచాలి?

బీరువాను ఎప్పుడూ సరైన దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఉత్తర దిశను సంపద, ఐశ్వర్యానికి అధిపతిగా చెబుతారు. ఈ దిశ కుబేరుడికి సంబంధించినది కాబట్టి, డబ్బులు, విలువైన వస్తువులను బీరువా లేదా లాకర్‌లో ఉంచినట్లయితే, దానిని ఉత్తర దిశలో పెట్టడం మంచిది.

వాస్తు ప్రకారం డబ్బును భద్రపరిచేటప్పుడు ఉత్తర దిశ చాలా అనుకూలంగా ఉంటుంది. బంగారం, వెండి ఆభరణాలను శుభ్రమైన, క్రమబద్ధమైన బీరువాలో భద్రపరచుకోవాలి. నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఎప్పుడూ సురక్షితమైన చోట ఉంచాలి.

బీరువా చుట్టూ అనవసరమైన వస్తువులు, పాత సామాన్లు వంటివి లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు వంటి వాటికి నీరు తగలకుండా, తేమకు గురికాకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. బీరువాలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

దీపావళి నాడు బీరువా, లాకర్, డబ్బులకు ఎందుకు పూజ చేయాలి?

మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాలకు అధిదేవతగా భావిస్తారు. అలాగే కుబేరుడిని సంపదకు అధిపతిగా పూజిస్తారు.

దీపావళి నాడు డబ్బులు, బీరువా, విలువైన వస్తువులను శుభ్రం చేసి పూజలో భాగంగా పెడతారు. ఇలా పూజించడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని, ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుందని నమ్ముతారు.

ఈ వస్తువులను కొనుగోలు చేయొద్దు

ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకూడదని చెబుతారు.

ధన త్రయోదశి నాడు పగిలిపోయిన, పనికిరాని వస్తువులను ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. అలాగే లోహాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదని అంటారు. పూజా సామగ్రిని ప్రత్యేకమైన, శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. బీరువా లోపల, బయట శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేయాలి. బీరువా స్థానాన్ని మార్చే ముందు ఏ దిశలో ఉంచుకోవాలనేది చూసుకోవాలి. శుభ ఫలితాలు కలిగే విధంగా బీరువాను ఉంచడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks