...
...
Next Story

లక్ష్మీ కటాక్షం పొందాలంటే దీపావళి రోజు ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదవాల్సిందే!

దీపావళి పర్వదినాన మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు మహాలక్ష్మి మూల మంత్రం, మహాలక్ష్మీ అష్టకం, లక్ష్మీ గాయత్రీ మంత్రం, లక్ష్మీ బీజ మంత్రం వంటి పవిత్ర మంత్రాలు, స్తోత్రాలను పఠించవచ్చు.

Published on: Nov 7, 2026, 14:00:33 IST
Advertisement

దీపావళి నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అలాగే, దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మంత్రాలను చదువుతారు. అష్టోత్తర శతనామాలు, స్తోత్రాలు, శ్లోకాలు పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ గణపతి పూజ సమయంలో పఠించడానికి కొన్ని శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు, స్తోత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దీపావళి నాడు మహాలక్ష్మిని పూజించేటప్పుడు ఈ శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు చదువుకోండి

లక్ష్మీ కటాక్షం పొందాలంటే దీపావళి రోజు ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదవాల్సిందే! (AI)
లక్ష్మీ కటాక్షం పొందాలంటే దీపావళి రోజు ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదవాల్సిందే! (AI)

మహాలక్ష్మి మూల మంత్రం:

సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం కలగాలని దీపావళి నాడు ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి వీలవుతుంది.

మహాలక్ష్మి అష్టకం:

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే.. తో ప్రారంభమయ్యే శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కూడా దీపావళి నాడు చదువుకోండి. 8 శ్లోకాలతో కూడిన లక్ష్మీ అష్టకాన్ని చదవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సిరి సంపదలకు లోటు ఉండదు.

లక్ష్మీ గాయత్రీ మంత్రం:

ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే

విష్ణుపత్న్యై చ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్..

ఈ మంత్రాన్ని జపించడం వలన విష్ణువు, లక్ష్మీల అనుగ్రహం కలుగుతుంది. శుభాలను ప్రసాదించాలని లక్ష్మీదేవిని ధ్యానిస్తూ తప్పకుండా దీపావళి నాడు చదువుకోండి.

ధనలక్ష్మి ప్రార్థన:

ధనలక్ష్మి ప్రార్థన సర్వ కోరికలను నెరవేరుస్తుంది. పాపాలను తొలగిస్తుంది. లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహాన్ని ఇస్తుంది.

లక్ష్మీ బీజ మంత్రం:

ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః

ఈ మంత్రాన్ని చదవడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. భక్తిశ్రద్ధలతో 11, 21 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ఈ శ్లోకం చదువుకోండి

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

దీపావళి నాడు లక్ష్మీ పూజను ఈ విధంగా చేయండి:

సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని దీపాలను వెలిగించండి. తర్వాత లక్ష్మీ గణపతి విగ్రహాలను పూజా పీఠంపై ప్రతిష్ఠించండి.

పసుపు, కుంకుమలు, అక్షింతలు, పూలు సమర్పించండి.

వినాయకుడికి ప్రార్థన చేసి మహాలక్ష్మి మంత్రాలను చదువుకుని లక్ష్మీదేవిని పూజించండి. మహాలక్ష్మి అష్టకం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా చదువుకోవచ్చు.

చివరిగా నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వండి.

ఇలా ఈ విధంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks