వాస్తు: ఈ 4 ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా? వెంటనే ఈ పొరపాట్లు మానుకోండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వస్తువుల అమరికతో పాటు మనం ప్రతిరోజూ పాటించే అలవాట్లు కూడా ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా, ప్రశాంతంగా, తగినంత వెలుతురుతో ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది వాస్తు ప్రకారం నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల సానుకూల శక్తి కలుగుతుందని, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఇంటి దిశలు, అక్కడ ఉంచే వస్తువులతో పాటు ప్రతిరోజూ చేసే అలవాట్లకు కూడా సంబంధించి వాస్తు శాస్త్రంలో చాలా నియమాలు ఉన్నాయి. అందులో భోజనానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి.

భోజనం చేసేటప్పుడు ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో, ఎక్కడ కూర్చుని తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. మనం ఆహారం తినేటప్పుడు ఆ వాతావరణం మనసు, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే భోజనం చేసేటప్పుడు శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలాగే కొన్ని ప్రదేశాల్లో కూర్చుని భోజనం చేయడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
వాస్తు ప్రకారం ఈ ప్రదేశాల్లో కూర్చొని భోజనం చేయకూడదు.. మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా?
ప్రధాన ద్వారం దగ్గర భోజనం చేయకూడదు:
ప్రధాన ద్వారం దగ్గర భోజనం చేయడం మంచిది కాదు. అలాగే వంటగది గుమ్మం దగ్గర కూర్చుని భోజనం చేయడం కూడా అశుభం. ఇంట్లోకి శక్తి ప్రధాన ద్వారం ద్వారా వ్యాపిస్తుంది. అలాంటి ప్రదేశంలో భోజనం చేయడం వల్ల శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే ఆ ద్వారం గుండా రాకపోకలు సాగుతూ ఉండడం వల్ల భోజనంపై ఏకాగ్రత తగ్గుతుంది.
మంచంపై కూర్చుని భోజనం చేయకూడదు:
వాస్తు ప్రకారం మంచంపై కూర్చుని తినడం మంచిది కాదు. మంచం విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి ఉద్దేశించిన ప్రదేశం. కాబట్టి మంచంపై కూడా కూర్చొని భోజనం చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
బాత్రూమ్ ఎదురుగా కూర్చుని తినకూడదు:
బాత్రూమ్ ఎదురుగా కూర్చుని భోజనం చేయకూడదు. దీనికి ప్రధాన కారణం ఆహార పరిశుభ్రత. బాత్రూమ్ నుంచి వచ్చే దుర్వాసన, అపరిశుభ్రత భోజనం చేసే వాతావరణంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ తప్పు కూడా చేయొద్దు.
చీకటిగా, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో భోజనం చేయకూడదు:
వాస్తు ప్రకారం భోజనం చేసేటప్పుడు ఇల్లు అపరిశుభ్రంగా ఉండకూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కాబట్టి అటువంటి ప్రదేశంలో భోజనం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. భోజనం చేసేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని భోజనం చేయాలి. అలాగే భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. భోజనం తినేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి దూరమవుతుందని నమ్ముతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


