చాలామంది వాలెంటైన్స్ డేకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమించిన వారికి లేదా జీవిత భాగస్వామికి కూడా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు కూడా వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ కొనేశారా? ఈ గిఫ్ట్స్ మాత్రం ఇవ్వకూడదు. వీటిని బహుమతిగా ఇస్తే మాత్రం సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఈ బహుమతులు ఇవ్వడం ఎంతో అశుభం.
వాలెంటైన్స్ డే 2026

ప్రేమికుల రోజు నాడు ప్రేమను వ్యక్తపరచేందుకు ఇష్టపడిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే నాడు ఈ బహుమతులు ఇస్తే మాత్రం వాస్తు ప్రకారం శుభ ఫలితాలు ఎదురవవు. మరి ఎలాంటి బహుమతులను ఇవ్వకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం వీటిని ఎవరికీ బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు:
1.వెండి:
వెండి ఆభరణాలు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మీ భాగస్వామికి లేదా ఇష్టమైన వ్యక్తికి ఇస్తే బ్రేకప్‌కు కారణం అవ్వచ్చని అంటారు. ఎందుకంటే వెండి సంబంధాన్ని దెబ్బతీస్తుందని అంటారు. కానీ వెండి వస్తువులు ఎంతో విలువ కలిగి ఉంటాయి. పైగా చాలా అందమైన వెండి వస్తువులు కూడా ఉంటాయి.
2.చెప్పులు:
చెప్పులు ఎవరికీ బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. చెప్పులను బహుమతిగా ఇస్తే ప్రేమికులు దూరం అవుతారట. ఇది కేవలం మూఢనమ్మకం అని కూడా చాలా మంది భావిస్తారు. వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.
3.పదునైన వస్తువులు:
కత్తులు, కత్తెర్లు వంటి పదునైన బహుమతులను ఇవ్వడం మంచిది కాదు. వీటిని ఇవ్వడం వలన సంబంధం దెబ్బతింటుందని అంటారు. పైగా ఇలాంటి వస్తువులు ఇవ్వడం ప్రమాదకరం కూడా. కాబట్టి ఇలాంటి వస్తువులను వీలైతే ఇలాంటి వాటిని బహుమతికి ఇవ్వకపోవడమే మంచిది.
4.పర్ఫ్యూమ్స్:
సెంట్లు వంటి వాటిని ఇస్తే మంచిది కాదని, దురదృష్టం కలుగుతుందని అంటారు. పర్ఫ్యూమ్స్ను బహుమతిగా ఇవ్వడం వలన సంబంధాలు దూరం అవుతాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఇవ్వరు. కొంత మంది దీనిని మూఢనమ్మకం అని కొట్టిపారేసి వీటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఎవరి ఇష్టం వారిది.
5.జేబు రుమాళ్లు:
{{/usCountry}}సెంట్లు వంటి వాటిని ఇస్తే మంచిది కాదని, దురదృష్టం కలుగుతుందని అంటారు. పర్ఫ్యూమ్స్ను బహుమతిగా ఇవ్వడం వలన సంబంధాలు దూరం అవుతాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఇవ్వరు. కొంత మంది దీనిని మూఢనమ్మకం అని కొట్టిపారేసి వీటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఎవరి ఇష్టం వారిది.
5.జేబు రుమాళ్లు:
{{/usCountry}}జేబు రుమాళ్లను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట. ఇటువంటి వాటిని బహుమతిగా ఇస్తే కూడా రిలేషన్‌పై ప్రభావం పడుతుందని అంటారు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.
గమనిక: దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇక్కడ ఉన్న సమాచారం ఖచ్చితమైనదని మేము చెప్పలేము. వీటిని పాటించే ముందు కచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.