వాలెంటైన్స్ డే బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేదంటే బంధంలో సమస్యలు రావచ్చు!

ప్రేమించిన వారికి లేదా జీవిత భాగస్వామికి కూడా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు కూడా వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ కొనేశారా? ఈ గిఫ్ట్స్ మాత్రం ఇవ్వకూడదు. వీటిని బహుమతిగా ఇస్తే మాత్రం సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. 

Published on: Feb 14, 2026, 08:00:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాలెంటైన్స్ డేకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమించిన వారికి లేదా జీవిత భాగస్వామికి కూడా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు కూడా వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ కొనేశారా? ఈ గిఫ్ట్స్ మాత్రం ఇవ్వకూడదు. వీటిని బహుమతిగా ఇస్తే మాత్రం సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఈ బహుమతులు ఇవ్వడం ఎంతో అశుభం.

వాలెంటైన్స్ డే బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి (pinterest)
వాలెంటైన్స్ డే బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి (pinterest)

వాలెంటైన్స్ డే 2026

ప్రేమికుల రోజు నాడు ప్రేమను వ్యక్తపరచేందుకు ఇష్టపడిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే నాడు ఈ బహుమతులు ఇస్తే మాత్రం వాస్తు ప్రకారం శుభ ఫలితాలు ఎదురవవు. మరి ఎలాంటి బహుమతులను ఇవ్వకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం వీటిని ఎవరికీ బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు:

1.వెండి:

వెండి ఆభరణాలు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మీ భాగస్వామికి లేదా ఇష్టమైన వ్యక్తికి ఇస్తే బ్రేకప్‌కు కారణం అవ్వచ్చని అంటారు. ఎందుకంటే వెండి సంబంధాన్ని దెబ్బతీస్తుందని అంటారు. కానీ వెండి వస్తువులు ఎంతో విలువ కలిగి ఉంటాయి. పైగా చాలా అందమైన వెండి వస్తువులు కూడా ఉంటాయి.

2.చెప్పులు:

చెప్పులు ఎవరికీ బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. చెప్పులను బహుమతిగా ఇస్తే ప్రేమికులు దూరం అవుతారట. ఇది కేవలం మూఢనమ్మకం అని కూడా చాలా మంది భావిస్తారు. వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.

3.పదునైన వస్తువులు:

కత్తులు, కత్తెర్లు వంటి పదునైన బహుమతులను ఇవ్వడం మంచిది కాదు. వీటిని ఇవ్వడం వలన సంబంధం దెబ్బతింటుందని అంటారు. పైగా ఇలాంటి వస్తువులు ఇవ్వడం ప్రమాదకరం కూడా. కాబట్టి ఇలాంటి వస్తువులను వీలైతే ఇలాంటి వాటిని బహుమతికి ఇవ్వకపోవడమే మంచిది.

4.పర్ఫ్యూమ్స్‌:

సెంట్లు వంటి వాటిని ఇస్తే మంచిది కాదని, దురదృష్టం కలుగుతుందని అంటారు. పర్ఫ్యూమ్స్‌ను బహుమతిగా ఇవ్వడం వలన సంబంధాలు దూరం అవుతాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఇవ్వరు. కొంత మంది దీనిని మూఢనమ్మకం అని కొట్టిపారేసి వీటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఎవరి ఇష్టం వారిది.

5.జేబు రుమాళ్లు:

జేబు రుమాళ్లను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట. ఇటువంటి వాటిని బహుమతిగా ఇస్తే కూడా రిలేషన్‌పై ప్రభావం పడుతుందని అంటారు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.

గమనిక: దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇక్కడ ఉన్న సమాచారం ఖచ్చితమైనదని మేము చెప్పలేము. వీటిని పాటించే ముందు కచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More