...
...
Next Story

2026 ప్రారంభానికి ముందు ఈ 5 ఫాలో అవ్వండి.. ఇక లక్ష్మీదేవి ఏడాది అంతా కాసుల వర్షం కురిపిస్తుంది

కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరం మీకు అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అయితే వీటిని ఫాలో అవ్వండి. కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండడానికి వీటిని పాటించడం మంచిది. న్యూ ఇయర్ రాక ముందు వీటిని పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు.

Published on: Dec 18, 2025, 15:01:19 IST
Advertisement

మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగుండాలని, అన్నీ కలిసి రావాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరం మీకు అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అన్ని విధాలుగా లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే వీటిని ఫాలో అవ్వండి. కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండడానికి వీటిని పాటించడం మంచిది.

2026 ప్రారంభానికి ముందు ఈ 5 అలవాట్లను అలవరుచుకోండి (pinterest)
2026 ప్రారంభానికి ముందు ఈ 5 అలవాట్లను అలవరుచుకోండి (pinterest)

అలాగే ఇలా చేయడం వలన సంతోషం, సంపద కూడా పెరుగుతాయి. మరి 2026 ప్రారంభంలో ఏం చేయాలి? ఎలా కొత్త సంవత్సరాన్ని మొదలు పెడితే ఈ లాభాలను పొందడానికి వీలవుతుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం చూస్తే, ఈ ముఖ్యమైన ఐదు పనులు చేయడం వలన చాలా బాగా కలిసి వస్తుంది. 2026 మొదలు కాక ముందే వీటిని పాటించండి.

గరుడ పురాణం ఏం చెప్తుంది?

గరుడ పురాణం ప్రకారం ఏ ఇంట్లో అయితే మహిళను అగౌరవపరుస్తారో, ఆ ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి. మర్యాదగా మాట్లాడాలి. ప్రేమగా చూసుకుంటూ గౌరవిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

దాన ధర్మాలు

మన సంపాదనలో కొంచమైనా దానధర్మాలకు కేటాయించాలి. దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. దాన ధర్మాలు చేయడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే గోసేవ చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. న్యూ ఇయర్ రాక ముందు వీటిని పాటిస్తే కొత్త సంవత్సరం డబ్బుకు లోటు ఉండదు.

అహంకారాన్ని వదిలిపెట్టాలి

గరుడ పురాణం ప్రకారం ఎప్పుడూ శరీరం, మనసు రెండూ స్వచ్ఛంగా ఉండాలి. అలాగే ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు కూడా రావు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks