...
...
Next Story

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మార్పులు చేస్తే.. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది, సంతోషంగా ఉండచ్చు!

వాస్తు ప్రకారం పాటిస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అందుకనే ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు చూసుకుంటారు. ఇంట్లో ఉన్న ప్రతి గది, వస్తువును వాస్తు ప్రకారం ఉంచాలి. అప్పుడే ప్రతికూల శక్తి లేకుండా, వాస్తు దోషాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు.

Published on: Jan 16, 2026, 13:30:13 IST
Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అందుకే చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనేక మార్పులను జీవితంలో చూడొచ్చు. అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించడం కూడా మంచిది.

వాస్తు శాస్త్రం

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మార్పులు చేస్తే.. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది (pinterest)
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మార్పులు చేస్తే.. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది (pinterest)

చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అందుకనే ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు చూసుకుంటారు. అప్పుడే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి గది, వస్తువును కూడా వాస్తు ప్రకారం ఉంచాలి. అప్పుడే అన్ని బాగుంటాయి. ప్రతికూల శక్తి లేకుండా, వాస్తు దోషాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అయితే, చాలా మంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటారు, కానీ సమస్యలు వస్తూ ఉంటాయి.

దంపతుల మధ్య సంబంధం మెరుగుపడాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించడం మంచిదే. ముఖ్యంగా ఈ వాస్తు చిట్కాలు పాటించడం వలన దంపతుల మధ్య ఆనందం ఉంటుంది. ప్రేమానురాగాలు బలపడతాయి, సఖ్యత ఏర్పడుతుంది, సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం ఇలా చేస్తే దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి

బెడ్‌రూమ్ దిశ:

ఎప్పుడూ కూడా పడకగది సరైన దిశలో ఉండాలి. అలా లేకపోతే సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్‌రూమ్ ఇంటికి నైరుతి వైపు ఉండాలి. నైరుతి వైపు ఉండడం వలన సమస్యలు రావు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఒకవేళ నైరుతి వైపు పడకగది ఉండడం కుదరకపోయినట్లయితే దక్షిణం, తూర్పు లేదా పడమర దిశల్లో ఉండొచ్చు.

ఎప్పుడూ కూడా ఇల్లు అందంగా, శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సర్దుకోవాలి. అనవసరమైన సామాన్లు, పనికిరాని వాటిని తొలగించాలి. అలా చేస్తే సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే అనవసరమైన వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించాలి.

సరైన రంగులు:

సరైన రంగులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. బెడ్‌రూంలో సరైన రంగులు ఉండాలి. ముదురు రంగులు కాకుండా పాస్టల్ షేడ్స్, పింక్, పీచ్ వంటి రంగులు ఉంటే మంచిది. ముదురు రంగులు ఉంటే మానసిక స్థితి, శక్తి గణనీయంగా ప్రభావితమవుతాయి. శృంగార వాతావరణాన్ని సృష్టించేందుకు తాజా పువ్వులను పెట్టండి, సువాసన వచ్చే కొవ్వొత్తులను వెలిగించండి.

అద్దాలు:

అద్దాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పడకగదిలో అద్దాలను పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం చూసుకోవాలి. లేకపోతే అశాంతి కలుగుతుంది. పడకగదిలో అద్దం పెట్టేటప్పుడు అది మంచానికి ఎదురుగా లేకుండా చూసుకోవడం చాలా అవసరం.

సరైన వెల్తురు:

పడకగదిలో వెల్తురు కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసౌకర్య భావనను కలిగించే కఠినమైన లైటింగ్ లేకుండా చూసుకోవాలి. ఇలా ఈ వాస్తు నియమాలను పాటించడం వలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, ఆనందంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks