...
...
Next Story

మహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది.. డబ్బు, సంతోషం ఇలా ఎన్నో లాభాలు!

హిందూ వైదిక సంప్రదాయంలో సాయంత్రం దీపం వెలిగించడం శుభానికి, పవిత్రతకు, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక కుటుంబాలు ఇంటి గడప వద్ద దీపారాధన చేస్తుంటాయి.

Published on: Jul 18, 2026, 12:30:54 IST
Advertisement

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని, ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించాలని అనుకుంటారు. అయితే, ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఈ పరిహారాలను పాటించడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు కూడా లోటు ఉండదు.

మహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది.. డబ్బు, సంతోషం ఇలా ఎన్నో లాభాలు! (pinterest)
మహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది.. డబ్బు, సంతోషం ఇలా ఎన్నో లాభాలు! (pinterest)

హిందూ వైదిక సంప్రదాయంలో దీపం వెలిగించడం అనేది శుభానికి, పవిత్రతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే, దీపం వెలుగు అనేది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకొస్తుందని విశ్వాసం.

సాయంత్రం దీపం

చాలా మంది ఉదయం పూట పూజలు చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా దీపం వెలిగించడం మంచిదే. సనాతన ధర్మంలో సాయంత్రం వేళ మహాలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. అందుకనే చాలా ఇళ్లల్లో సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం లేదా గడప దగ్గర దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చని విశ్వసిస్తారు. పరిశుభ్రమైన ఇల్లు, భక్తితో చేసే పూజ, దీపారాధన కారణంగా ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. ఆనందం, ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి.

భక్తితో పాటు సత్కర్మలు

నిజాయితీ, కష్టపడి పని చేయడం, మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడే భక్తి మరింత అర్థవంతంగా ఉంటుంది. అయితే, కేవలం దీపం వెలిగించడం మాత్రమే కాదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించుకోవాలి. ఇతరులకు దానం చేయడం, సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది.

శుభం కరోతి కల్యాణం

ఆరోగ్యం ధన సంపదః

శత్రుబుద్ధి వినాశాయ

దీపజ్యోతి నమోస్తుతే

నమస్తేస్తు మహామాయే..

శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే

మహాలక్ష్మి నమోస్తుతే..

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీరంగధామేశ్వరీమ్

దాసీభూత సమస్త దేవవనితాం

లోకైక దీపాంకురామ్..

సర్వమంగళ మాంగల్యే

శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవి

నారాయణి నమోస్తుతే..

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks