మరణం తర్వాత ఏం జరుగుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బతికి ఉన్నవాళ్లకు దీని సమాధానం తెలియదు కాబట్టి. కానీ గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో చెప్పినట్లుగా మరణం తర్వాత కొన్ని గంటలలో ఆత్మకు చాలా విషయాలు అర్థం అవుతాయ్. సంపాదన, బంధుత్వం, నాది-నీది.. ఇలా చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది.

ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానంలో చితికి నిప్పంటించి అందరూ తిరిగి వస్తారు. ఇక అక్కడ మిగిలేది కేవలం బూడిద, నిశ్శబ్దం, చనిపోయిన వ్యక్తి ఆత్మ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమించి, అలంకరించుకుని, అద్దంలో గర్వంగా చూసుకున్న తన శరీరం కేవలం బూడిదగా మారిపోతుంది. అందం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఈ సమయంలో తన శరీరం కాలిపోవడాన్ని చూసి ఆత్మ బాధపడుతుంది. అగ్ని వేడికి అది తిరిగి శరీరంలోకి ప్రవేశించలేకపోతుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ భౌతిక ప్రపంచంలో తాను భాగం కాదనే చేదు నిజాన్ని ఆత్మ అర్థం చేసుకుంటుంది
గరుడ పురాణం ప్రకారం, పుర్రె పగిలిన వెంటనే వచ్చే పెద్ద శబ్దంతో ఆత్మకు మరింత క్లారిటీ వస్తుంది. ఈ క్షణంలో భౌతిక శరీరంతో ఆత్మకు ఉన్న చివరి బంధం శాశ్వతంగా తెగిపోతుంది. శ్మశానం నుండి తిరిగి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూడకూడదనే నియమం ఉంది. ఎందుకంటే ఆ భయంకరమైన ప్రదేశంలో తమను ఒంటరిగా వదిలి వెళ్తున్న వారిని చూసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని ఆత్మ అరుస్తుందట.
శ్మశానంలోని ఒంటరితనం, వింత ఆత్మలకు భయపడి, ఆత్మ తన కుటుంబ సభ్యుల వెంట పరిగెత్తి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులు వేప ఆకులు నమలడం, ఇనుము లేదా నిప్పును తాకడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. అంతేకాదు పులు తీసుకెళ్లి ఫొటో దగ్గర పెట్టడం, చేదు నోరు.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉన్నాయి. దీనివల్ల ఆత్మ వెంటనే ఇంట్లోకి ప్రవేశించడం కష్టమవుతుంది.
{{/usCountry}}శ్మశానంలోని ఒంటరితనం, వింత ఆత్మలకు భయపడి, ఆత్మ తన కుటుంబ సభ్యుల వెంట పరిగెత్తి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులు వేప ఆకులు నమలడం, ఇనుము లేదా నిప్పును తాకడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. అంతేకాదు పులు తీసుకెళ్లి ఫొటో దగ్గర పెట్టడం, చేదు నోరు.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉన్నాయి. దీనివల్ల ఆత్మ వెంటనే ఇంట్లోకి ప్రవేశించడం కష్టమవుతుంది.
{{/usCountry}}తాను చనిపోయినందుకు ఇంట్లోని కొందరు కుటుంబ సభ్యులు మరణానికి దుఃఖిస్తుంటాడు. మరికొందరు ఆస్తిపాస్తుల లెక్కల గురించి ఆలోచిస్తుంటారు. ఇవన్నింటినీ ఆత్మ నిశితంగా గమనిస్తుంది. తన జీవితాంతం ఇతరుల మనసులను గాయపరిచిన డబ్బు, ఆస్తిపాస్తులు, నగలు అన్నీ వ్యర్థమని, తాను ఒట్టి చేతులతో నిలబడి ఉన్నానని గ్రహిస్తుంది. అంతేకాదు బంధాలను చూసి ఆత్మ బాధపడుతుంది. శూన్యతా భావన ఆత్మను తీవ్రంగా కుంగదీస్తుంది.
బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తాను చేసిన పాపాలు, పుణ్యకార్యాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటుంది ఆత్మ. ఎవరినైనా మోసం చేసి ఉంటే కన్నీరు కార్చుతుంది. పాపాలు చేసిన ఆత్మలు రెప్పవేయని కళ్ళతో, భయంకరమైన రూపంతో యమదూతలను చూస్తుండగా, పుణ్యకార్యాలు చేసిన ఆత్మలను సౌమ్యమైన యమదూతలు లేదా నిజమైన విష్ణుదూతలు గౌరవంగా వచ్చి తీసుకువెళతారని నమ్మకం.
గరుడ పురాణం ప్రకారం, మరణించినవారికి పిండం సమర్పించడం చాలా ముఖ్యం. ఆచారం ప్రకారం ఇది చేయకపోతే, ఆత్మ తీవ్రమైన ఆకలి కారణంగా శ్మశానంలో లేదా నీటి వనరుల సమీపంలో సంచరిస్తుందని చెబుతుంటారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి దానధర్మాలు చేయాలి. పేదలకు సహాయం చేయాలి. మనం జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు మాత్రమే మరణం తర్వాత మనతో ఉంటాయి.
గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.