...
...
Next Story

Donation for Wealth: గుడిలో రహస్యంగా ఈ 6 దానం చేస్తే డబ్బుకి లోటు ఉండదు.. అదృష్టం, ఆనందం రెట్టింపు!

దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే మనం చేసిన దానాన్ని ఇతరులకు చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. వీటిని దేవాలయంలో రహస్యంగా దానం చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆలయంలో దానం చేయాల్సినవి ఏంటి?

Published on: Feb 13, 2026, 15:01:06 IST
Advertisement

దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం చేసే దానాన్ని బట్టి శుభఫలితాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిటిని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా వీటిని దేవాలయంలో రహస్యంగా దానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అదృష్టం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలను కూడా పొందడానికి వీలవుతుంది. మరి ఎలాంటి వాటిని దానం చేయాలి? వీటిని దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. ఆలయంలో దానం చేయాల్సినవి ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దానం ప్రాముఖ్యత

Donation for Wealth: గుడిలో రహస్యంగా ఈ 6 దానం చేస్తే డబ్బుకి లోటు ఉండదు (pinterest)
Donation for Wealth: గుడిలో రహస్యంగా ఈ 6 దానం చేస్తే డబ్బుకి లోటు ఉండదు (pinterest)

దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే మనం చేసిన దానాన్ని ఇతరులకు చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. వీటిని దేవాలయంలో రహస్యంగా దానం చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

1.కర్పూరం

కర్పూరాన్ని మనం పూజలో వాడుతూ ఉంటాం. ఆలయాల్లో కూడా కర్పూరాన్ని వెలిగిస్తారు. కర్పూరాన్ని వెలిగిస్తే ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. మానసికంగా కూడా తేలికగా అనిపిస్తుంది. కర్పూరాన్ని దానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. దేవాలయంలో రహస్యంగా కర్పూరాన్ని దానం చేయడం మంచిది.

2.ఆసనాలు

పూజ చేసేటప్పుడు ఆసనాలను వాడుతుంటాం. ఆసనాలు స్థిరత్వాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఆసనాలను దానం చేయడం కూడా శుభఫలితాలను తీసుకొస్తుంది. త్వరగా విజయాలను అందుకోవచ్చు. వీటిని దానం చేయడం వలన ఆదాయం కూడా పెరుగుతుంది.

3.గొడుగు

గొడుగులను దానం చేయడం కూడా శుభఫలితాలను తీసుకొస్తుంది. గొడుగును దానం చేయడం వలన భయాలు తొలగిపోతాయి. నమ్మకం పెరుగుతుంది. కొత్త ప్రయాణాలను మొదలుపెట్టడానికి వీలవుతుంది. గొడుగును దానం చేస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయి.

4.అగ్గిపెట్టెలు

దీప దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. గుడిలో రహస్యంగా దీపదానం చేస్తే శుభఫలితాలను పొందవచ్చు. వంశం వృద్ధి చెందుతుంది. దీపదానానికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి దీపదానాన్ని తేలికగా తీసుకోకుండా దానం చేయడం ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుంది.

6.అన్నదానం

ఒకరి ఆకలిని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. అన్నదానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. చాలామంది దేవాలయాల్లో అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం చేయడం వలన ప్రశాంతత, సానుకూల ఆలోచనలు రావడం ఇలా అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అన్నదానం చాలా గొప్పదనం. అన్నదానానికి మించిన దానం లేదని కూడా అంటారు. కాబట్టి అన్ని దానాల్లో ఉత్తమమైన అన్నదానాన్ని రహస్యంగా గుడిలో చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe