మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావిస్తారు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినట్లయితే మీరు బాధపడకండి. ఎండిపోయిన తులసి మొక్క కూడా అంతే పవిత్రమైనది.

తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని, విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టమని విశ్వసిస్తారు. తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించడం మంచిది కాదు. అలాగే, తెలియక గానీ తెలిసి గానీ తులసి మొక్కకు సంబంధించిన తప్పులు చేయకూడదు. అలా చేస్తే విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగి ఇబ్బందులు రావచ్చు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోయినట్లయితే దానిని పారేయకండి. ఈ పరిహారాలను పాటించచ్చు. ఆధ్యాత్మికంగా తులసి మొక్కను ఎండిపోయిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి?
ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దానిని పారేయక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ పారేయడం వలన తీవ్రమైన దోషాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి. తులసి మొక్క ఎండిపోతే ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ పరిహారాలను పాటించచ్చు. కానీ పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయద్దు. ప్రతికూల శక్తులు పెరిగే అవకాశం ఉంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. తులసి మొక్కను గౌరవంగా ప్రవహించే నదిలో లేదా పవిత్ర జలాల్లో కలపడం మంచిది. అలాగే ఈ పరిహారాలను కూడా పాటించొచ్చు.
తులసి మాల
ఎండిపోయిన తులసి కొమ్మలను శుభ్రం చేసి, గంగాజలంతో శుద్ధి చేసి తులసి మాలను తయారు చేసుకుని మెడలో వేసుకోవచ్చు. తులసి మాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది మనసును ప్రశాంతంగా మార్చడంతో పాటు చెడు ఆలోచనలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ మాలను ధరించేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.
ప్రధాన ద్వారం
{{/usCountry}}ఎండిపోయిన తులసి కొమ్మలను శుభ్రం చేసి, గంగాజలంతో శుద్ధి చేసి తులసి మాలను తయారు చేసుకుని మెడలో వేసుకోవచ్చు. తులసి మాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది మనసును ప్రశాంతంగా మార్చడంతో పాటు చెడు ఆలోచనలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ మాలను ధరించేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.
ప్రధాన ద్వారం
{{/usCountry}}ఎండిపోయిన తులసి కొమ్మలను ఎర్ర వస్త్రంలో చుట్టి ప్రధాన ద్వారానికి తగిలించండి. దీని వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
తులసి కాడలతో దీపం
తులసి కాడలతో దీపాలను వెలిగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ తులసి కాడతో దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దరిద్రం తొలగిపోతుంది. దీపాన్ని వెలిగించిన తర్వాత ఇల్లంతా చూపించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. సుఖసంతోషాలు కలుగుతాయి.
పూజ గదిలో
పూజ గదిలో ఎండిపోయిన తులసి ఆకులను, కొమ్మలను ఎర్రటి వస్త్రంలో పెట్టి ఉంచండి. ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగి ప్రశాంతంగా ఉండొచ్చు.
హోమాలు, యజ్ఞాలు
హోమాలు, యజ్ఞాలు చేసినప్పుడు ఎండిన తులసి కొమ్మలను హవిస్సుగా వాడుకోవచ్చు. తులసిని సమర్పిస్తే దేవతలు సంతోషించి ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తారు.