రాశి ఫలాలు 14 జనవరి 2026: ఈరోజు భోగి పండుగ వేళ ఏ రాశులకు శుభ ఫలితాలు ఎదురవుతాయి? 12 రాశుల రాశి ఫలాలు ఇవిగో!

రాశి ఫలాలు 14 జనవరి 2026: వేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశి చక్రాలు వివరించబడ్డాయి. గ్రహాలు, నక్షత్ర, రాశుల కదలిక నుండి జాతకం లెక్కించబడుతుంది. 14 జనవరి 2026 న ఏ రాశులకు ప్రయోజనం చేకూరుస్తాయో, ఏ రాశులు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి.

Published on: Jan 14, 2026, 04:00:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు, నక్షత్ర, రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, జనవరి 14 కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. జనవరి 14న ఏ రాశిచక్రాలకు ప్రయోజనం చేకూరుతుందో, ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

జనవరి 14 రాశి ఫలాలు
జనవరి 14 రాశి ఫలాలు

మేష రాశి:

ఈరోజు మీరు సంపన్నంగా ఉంటారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో తెలివిగా ఉండండి. మీ రోజు ఉత్పాదకంగా ఉంటుంది. ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఈరోజు ఆఫీస్ గాసిప్‌లకు దూరంగా ఉంటారు. ఆఫీసు పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. తెలివైన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు.

మిథున రాశి:

క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేయడం ద్వారా మీ కెరీర్ జీవితాన్ని ఉత్పాదకంగా ఉంచండి. ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని ఆనందంగా మార్చండి. సురక్షితమైన ఆర్థిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు సంబంధంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

కర్కాటక రాశి:

నేడు కర్కాటక రాశి ప్రేమలోకి అహంకారాన్ని రానివ్వద్దు. భవిష్యత్తు కోసం ప్లాన్ చేయండి. మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి కార్యాలయంలో కొత్త పనులను చేపడతారు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు.

సింహ రాశి:

నేడు మీరు నచ్చిన వారితో సంతోషంగా వుంటారు. వృత్తిపరమైన రిస్క్ తీసుకోవడానికి ముందుటారు. సంపద మరియు ఆరోగ్యం రెండూ బాగుంటాయి. కొంతమంది మహిళలు ఆస్తిని కూడా వారసత్వంగా పొందుతారు. మీరు మీ బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:

ప్రేమలో సంతోషకరమైన క్షణాల కోసం చూడండి. కార్యాలయంలో కొత్త పాత్రలను తప్పకుండా చేపట్టండి. గుడ్డిగా పెట్టుబడి పెట్టవద్దు, కానీ సరైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించండి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల రాశి:

మీరు ప్రేమ జీవితంలో ఉత్తమ క్షణాలను చూస్తారు. వృత్తిపరమైన సమస్యలను పరిష్కరిస్తారు. సురక్షితమైన ఆర్థిక పెట్టుబడులను పరిగణించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు పని, జీవితం మధ్య అవసరమైన సమతుల్యతను నిర్వహించాలి.

వృశ్చిక రాశి:

నేడు వృశ్చిక రాశి వారు ప్రేమ జీవితంలో న్యాయంగా ఉండాలి. మీ కెరీర్‌లో రిస్క్ తీసుకున్నా మంచిదే. శ్రేయస్సు ఉన్నప్పటికీ, మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ధనుస్సు రాశి:

సంబంధాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. మెరుగైన ఎదుగుదల కోసం వృత్తిపరమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు శ్రేయస్సు ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మకర రాశి:

నేడు సంబంధంలో సంతోషకరమైన క్షణాల కోసం చూడండి. ప్రేమ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకు వెళ్ళండి. ఆఫీసులో అహాన్ని దూరంగా ఉంచండి. ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు డబ్బు వచ్చినప్పుడు సురక్షితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి నేడు డబ్బు వస్తుంది. మీరు వృత్తిపరమైన అంచనాలను కూడా అందుకుంటున్నారని నిర్ధారించుకోండి. ఈ రోజు ఆర్థికంగా మరియు ఆరోగ్యం రెండూ బాగుంటాయి.

మీన రాశి:

సంబంధంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. కష్టపడి పనిచేయడంతో పనిప్రాంతంలో అన్నీ టైంకి పూర్తవుతాయి. సురక్షితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More