...
...
Next Story

ఏకాదశులు 2026 మార్చి: ఈ నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి? పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి తేదీలు, సమయం వివరాలు ఇవిగో

ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. ఉపవాసం ఉండకపోయినా ఆ రోజు బట్టలు ఉతకడం, అన్నం తినడం వంటివి చేయకూడదు. ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. జీవితంలోని కష్టాలను తొలగిపోతాయి. సంపద, సమృద్ధి, శాంతిని పొందవచ్చు. మార్చి నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.

Published on: Mar 7, 2026, 08:01:00 IST
Advertisement

ఏకాదశి తిథి అంటే విష్ణువుకి ఎంతో ఇష్టం. ఆ రోజు విష్ణువును ఆరాధించడం వలన ఆనందం, సంపద పెరుగుతాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. ఉపవాసం ఉండకపోయినా ఆ రోజు బట్టలు ఉతకడం, అన్నం తినడం వంటివి చేయకూడదు.

ఏకాదశులు 2026 మార్చి: ఈ నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి? (pinterest)
ఏకాదశులు 2026 మార్చి: ఈ నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి? (pinterest)

ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. జీవితంలోని కష్టాలను తొలగిపోతాయి. సంపద, సమృద్ధి, శాంతిని పొందవచ్చు. మార్చి నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయో, ఏకాదశికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2026 మార్చి నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి?

మార్చి నెలలో ఫాల్గుణ కృష్ణ ఏకాదశి మరియు చైత్ర శుక్ల ఏకాదశి రానున్నాయి. ఫాల్గుణ కృష్ణ పక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని అంటారు. అలాగే చైత్ర శుక్ల పక్ష ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఈ రెండు ఏకాదశి రోజుల్లో విష్ణువును ఆరాధించడం వలన ఆనందం కలుగుతుంది. అనుకున్నవన్నీ ఫలిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

పాపమోచని ఏకాదశి 2026:

పాపమోచని ఏకాదశి పేరులోనే వుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయని తెలుపుతుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సంతోషం, ప్రశాంతత కలుగుతాయి. విష్ణు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. పాపమోచని ఏకాదశి నాడు పాపాలన్నీ తొలగించేందుకు ఇది మంచి రోజు. ఆ రోజు ఉపవాసం ఉంటే మనసు, దేహం స్వచ్ఛంగా మారుతాయి.

కామద ఏకాదశి చైత్ర మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుతారు. ఆ రోజు ఉపవాసం ఉంటే కోరికలు తీరుతాయి. ఏకాదశి తిథి మార్చి 28 ఉదయం 8:45కి మొదలవుతుంది. మార్చి 29 ఉదయం 7:46కి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశిని మార్చి 29న జరుపుకోవాలి. మార్చి 30న ఉపవాసాన్ని విరమించాలి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, విష్ణువుని ఆరాధిస్తే జీవితంలోని కష్టాలను తొలగిపోతాయి. సంపద, సమృద్ధి, శాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిని కూడా పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks