...
...
Next Story

Today Horoscope: నేడు గణేశుడి ఆశీస్సులు ఆ రాశులపైనే! ఎవరికి ప్రమోషన్, ఎవరికి ధనలాభం? పూర్తి రాశి ఫలాలు తెలుసుకోండి!

రాశి ఫలాలు: ఏప్రిల్ 22, 2026 బుధవారం నాడు గణపతి ఆరాధనతో కొన్ని రాశుల వారికి విఘ్నాలు తొలగి అదృష్టం వరించనుంది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి ఆర్థిక, ఆరోగ్య, వృత్తిపరమైన జాతక విశ్లేషణ మీకోసం. ఇక పన్నెండు రాశులకు ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Published on: Apr 22, 2026, 04:00:38 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం బుధుడికి, విఘ్న వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. గ్రహాల గమనాన్ని బట్టి చూస్తే, నేడు కొన్ని రాశుల వారికి రాజయోగాలు పట్టనుండగా, మరి కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గణేశుడిని పూజించడం వల్ల బుధ దోషాలు తొలగి, బుద్ధి వికాసం, సుఖ సంతోషాలు కలుగుతాయి.

మేష రాశి

Today Horoscope: నేడు గణేశుడి ఆశీస్సులు ఆ రాశులపైనే! ఎవరికి ప్రమోషన్, ఎవరికి ధనలాభం?
Today Horoscope: నేడు గణేశుడి ఆశీస్సులు ఆ రాశులపైనే! ఎవరికి ప్రమోషన్, ఎవరికి ధనలాభం?

ఈరోజు మేష రాశి వారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విలాసాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది, దీని వల్ల మీ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావచ్చు. వ్యాపారులకు లాభాలు వస్తాయి కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.

వృషభ రాశి:

మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి.

మిథున రాశి:

మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే, సాయంత్రం వేళ ఎవరితోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు. వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

కర్కాటక రాశి:

ఈరోజు ఉదయం పూట కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది, కాస్త సంయమనంతో వ్యవహరించండి.

సింహ రాశి:

సింహ రాశి వారు ఆఫీసులో ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశం ఉంది. రహస్య శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు.

కన్య రాశి:

తులా రాశి వారు మాట తీరుపై అదుపు ఉండాలి. కోపాన్ని తగ్గించుకుంటేనే కార్యసిద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తీపి కబురు అందుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, అదృష్టం మీ వెంటే ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు రేపు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు రాశి:

పని నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా, సాయంత్రానికి పరిస్థితి మీ అదుపులోకి వస్తుంది.

మకర రాశి:

ఆఫీసులో ఇతరుల గురించి గాసిప్స్ చెప్పడం మానుకోండి, లేదంటే చిక్కుల్లో పడతారు. విద్యార్థులకు సాయంత్రం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది.

కుంభ రాశి:

ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ప్రేమ, వివాహ జీవితం మధురంగా ఉంటుంది. ఏ పనిలోనూ నిర్లక్ష్యం వహించవద్దు.

మీన రాశి:

భారీ ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. సమయాన్ని, ధనాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఆర్థిక ప్రణాళిక ముఖ్యం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe