...
...
Next Story

ఈ ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం ఇండియాలో కనపడుతుందా? తేదీ, సమయం, సూతక కాలం వివరాలు!

సాధారణంగా ఒక నెలలో సూర్య గ్రహణం వస్తే, మరో నెలలో చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా? సూతక కాలంతో పాటు ఏ దేశాల్లో కనపడనుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Feb 06, 2026 04:30 PM IST
Advertisement

ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రావడాన్ని మనం చూస్తూనే ఉంటాం. 2026 ప్రారంభమై నెల రోజులు దాటింది. 2026లో కూడా ఎప్పటిలానే కొన్ని సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడబోతోంది. మన హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం చాలా విశేషమైనది.

ఈ ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం ఇండియాలో కనపడుతుందా? (pinterest)
ఈ ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం ఇండియాలో కనపడుతుందా? (pinterest)

సాధారణంగా ఒక నెలలో సూర్య గ్రహణం వస్తే, మరో నెలలో చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా? సూతక కాలంతో పాటు ఏ దేశాల్లో కనపడనుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో ఏర్పడబోతున్న మొదటి సూర్యగ్రహణం

హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. అయితే ఫిబ్రవరి 17న అమావాస్య, మంగళవారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం అమావాస్య మంగళవారం నాడు ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దీనిని కంకణాకార సూర్యగ్రహణం అని చెబుతున్నారు. ఈ గ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ మండుతున్న వలయంలా ఉంటుంది. ఆంగ్లంలో దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.

సూర్యగ్రహణం 2026: తేదీ, సమయం, సూతక కాలం

సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, మంగళవారం నాడు ఏర్పడబోతోంది. 2026లో ఈ సూర్యగ్రహణం పాక్షిక దశతో సుమారు 9:56 యూటీసీకి ప్రారంభమై, 12:00 యూటీసీకి గరిష్ట కవరేజ్‌కు చేరుకుంటుంది. అలాగే సుమారు 14:27 యూటీసీకి ఇది ముగియబోతోంది.

2026 ఫిబ్రవరి 17న ఏర్పడనున్న ఈ సూర్య గ్రహణం పశ్చిమ ఆసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. అలాగే ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాతో పాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు, అట్లాంటిక్, ధ్రువ ప్రాంతాల్లో కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. కనుక అక్కడ సూతకం కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. భారత దేశంలో మాత్రం సూతక కాలం చెల్లదు.

సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది

సూర్యగ్రహణం భారతదేశంలో కనప డకపోయినా, కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మేష రాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. శని రాశి అయిన కుంభరాశిలో ఈ గ్రహణం సంభవించడం వల్ల, ఈ రాశుల వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe