...
...
Next Story

February Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశులకు ఫిబ్రవరిలో అద్భుతంగా కలిసి వస్తుంది.. ఏ రంగంలోనైనా పురోగతి!

ఫిబ్రవరి నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మేష రాశి నుంచి కొన్ని రాశుల వరకు ప్రయోజనాలు పొందబోతున్నారు. ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి ప్రతి ఫీల్డ్‌లో పురోగతి కూడా.

Published on: Jan 31, 2026, 12:00:40 IST
Advertisement

ప్రతినెలా కూడా కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు వస్తుంది. ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.

February Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశులకు ఫిబ్రవరిలో అద్భుతంగా కలిసి వస్తుంది (pinterest)
February Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశులకు ఫిబ్రవరిలో అద్భుతంగా కలిసి వస్తుంది (pinterest)

గ్రహాలకు రాజైన బుధుడు, విలాసాలకు అధిపతైన శుక్రుడు, గ్రహాల అధిపతి సూర్యుడు, కుజుడు సంచారంలో మార్పు జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులను తీసుకు రాబోతోంది. మేష రాశి నుంచి కొన్ని రాశుల వరకు ప్రయోజనాలు పొందబోతున్నారు. ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి ప్రతి ఫీల్డ్‌లో పురోగతి కూడా ఉండబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం.. ప్రతి రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తారు

మేష రాశి

మేష రాశి వారికి ఫిబ్రవరి నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. అనుకున్న వాటిలో పూర్తిస్థాయిలో విజయవంతులు అవుతారు. ఒంటరిగా ఉన్న మేష రాశి వారు ఈ సమయంలో జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంది.

కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రిలేషన్‌షిప్ కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. సంతోషంగా ఉంటారు. మిత్రులు కూడా సహాయం చేస్తారు. అత్తింటివారి నుంచి కూడా సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.

కన్యా రాశి

ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతో మానసిక సంతృప్తి ఉంటుంది. డబ్బును బాగా ఆదా చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. రైటింగ్, డాన్స్, సైన్స్ రంగాల్లో పనిచేసే వారికి బాగుంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి సరైన సమయంలో వస్తుంది. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks