ఇంట్లో ఈ దిశలో ఇది ఒక్కటి పెడితే చాలు.. ధనయోగం, కెరీర్ వృద్ధి, అదృష్టం మీ సొంతం!
ఇంట్లో లోహపు తాబేలును ఏ దిశలో ఉంచాలి? నీటిలో ఎందుకు ఉంచాలి? ఎక్కడ పెట్టకూడదు? ఫెంగ్‌షుయ్, వాస్తు ప్రకారం మెటల్ టర్టిల్‌కు సంబంధించిన ముఖ్యమైన నియమాలు, విశ్వాసాలు మరియు చెప్పబడే ప్రయోజనాలను తెలుసుకోండి.
ఇంట్లో అలంకరణ కోసం చాలా మంది లోహంతో తయారు చేసిన తాబేలును ఉంచడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, ఫెంగ్షుయ్ శాస్త్రంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. సరిగ్గా చెప్పాలంటే, వాస్తు మరియు ఫెంగ్షుయ్ నిబంధనల ప్రకారం ఇంట్లో లోహపు తాబేలును సరైన దిశలో, సరైన పద్ధతిలో అమర్చితే ఆ ఇంటికి అదృష్టం క్యూ కడుతుంది.

జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, అలాగే ఆర్థికంగా ఊహించని వృద్ధి కనిపిస్తుంది. అయితే ఎక్కడపడితే అక్కడ ఈ తాబేలును పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కొన్ని కఠినమైన నియమాలను పాటించడం తప్పనిసరి.
లోహపు తాబేలును ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్రం కావొచ్చు లేదా ఫెంగ్ షుయ్ కావొచ్చు, ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన దిశ కేటాయించబడి ఉంటుంది. చాలా మంది తమ లివింగ్ రూమ్‌లో ఎక్కడో ఒకచోట ఈ తాబేలును పెట్టేస్తుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, లోహపు తాబేలును ఎల్లప్పుడూ ఉత్తర దిశలో లేదా ఉత్తర-పశ్చిమ దిశలో మాత్రమే ఉంచాలి.
మన సంస్కృతిలో మరియు వాస్తులో ఉత్తర దిశను కెరీర్‌లో ఎదుగుదలకి, ధన ప్రవాహానికి, సరికొత్త అవకాశాలకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ దిశలో లోహపు తాబేలును అమర్చడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారు తమ కార్యాలయాల్లో లేదా గృహాల్లో దీనిని ఉత్తర దిశలో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి.
నీటిలో ఉంచడం తప్పనిసరి
మీ ఇంట్లో లోహపు తాబేలును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లయితే, దానిని ఎప్పుడూ నీటిలో ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం గాజు, ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గిన్నెను ఎంచుకోవచ్చు. నియమాల ప్రకారం ఆ గిన్నెలో తాబేలు కాళ్లు మునిగేంత వరకు నీటిని పోయాలి. అంతేకాకుండా, ఆ గిన్నెలోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది మరియు ఆశించిన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
తాబేలు ముఖం ఏ వైపు ఉండాలి?
లోహపు తాబేలును ఇంట్లో ఉంచేటప్పుడు దాని ముఖం ఎల్లప్పుడూ ఇంటి లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల ఇంట్లోకి సిరులు, సంతోషం ప్రవహిస్తాయని నమ్ముతారు. పొరపాటున కూడా తాబేలు ముఖం ప్రధాన ద్వారం వైపు లేదా కిటికీ వైపు ఉండకూడదు.
ఎక్కడ అస్సలు పెట్టకూడదు?
ఈ లోహపు తాబేలును లివింగ్ రూమ్ లేదా ఆఫీసు డెస్క్ మీద పెట్టుకోవచ్చు కానీ, పొరపాటున కూడా బెడ్‌రూమ్, కిచెన్ లేదా బాత్రూమ్ పక్కన ఉంచకూడదు. ఈ ప్రాంతాల్లో దీనిని ఉంచడం తీవ్రమైన అశుభంగా భావిస్తారు. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే ప్రదేశంలోనే దీనిని అమర్చాలి. అలాగే క్రమం తప్పకుండా దీనిని శుభ్రం చేస్తూ ఉండాలి.
లోహపు తాబేలును ఉంచడం వల్ల కలిగే ప్రధాన లాభాలు
సరియైన నియమాలను పాటిస్తూ లోహపు తాబేలును ఇంట్లో ఉంచితే ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో ఉన్నవారు అనూహ్యమైన పురోగతిని సాధిస్తారు.
ఇంట్లో లోహపు తాబేలు ఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మరియు క్రమక్రమంగా ప్రతికూల శక్తులు ఇంటి నుంచి శాశ్వతంగా తొలగిపోతాయి. ఇంట్లో లోహపు తాబేలును ఉంచడం దీర్ఘకాలిక ఆయురారోగ్యాలకు చిహ్నంగా భావిస్తారు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


