చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాస్తు దోషాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే డబ్బు కూడా నిలవక ఇబ్బంది పడుతుంటారు.

అలాంటి వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది. తులసితో చేసే పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. రాహువు ప్రతికూల ప్రభావం తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తులసి పరిహారంతో వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి
తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. తులసి మొక్క ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన ఈ పరిహారాలను పాటించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి వీలవుతుంది.
తులసి వేర్లతో ఇలా చేయండి
తులసి మొక్క వేర్ల వద్ద మట్టిలో ఒక రూపాయి నాణాన్ని పాతిపెట్టండి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఈ పరిహారం శని, రాహుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా హెల్ప్ అవుతుంది.
వాస్తు దోషాలు కూడా సులువుగా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లో ప్రశాంతత కలగడానికి, ఆనందంగా ఉండడానికి తులసి మొక్క వేర్ల వద్ద మట్టిలో నాణాన్ని పాతిపెట్టండి. ఇలా చేస్తే ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా ఎక్కువ అవుతుంది.
ఈ పరిహారాన్ని ఎప్పుడు, ఎలా చేయాలి?
{{/usCountry}}వాస్తు దోషాలు కూడా సులువుగా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లో ప్రశాంతత కలగడానికి, ఆనందంగా ఉండడానికి తులసి మొక్క వేర్ల వద్ద మట్టిలో నాణాన్ని పాతిపెట్టండి. ఇలా చేస్తే ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా ఎక్కువ అవుతుంది.
ఈ పరిహారాన్ని ఎప్పుడు, ఎలా చేయాలి?
{{/usCountry}}గురువారం లేదా శుక్రవారం నాడు ఇది చేయడం మంచిది. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకున్నాక నాణాన్ని పాతిపెట్టండి. తరువాత రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టండి. ఇలా చేయడం వలన చక్కటి మార్పును చూడొచ్చు.
తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తులసి మొక్కను శీతాకాలంలో చల్లటి గాలుల నుంచి రక్షించుకోవాలి. మట్టి పొడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయాలి. ఇలాంటివి తప్పక పాటించాలి. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండకూడదు.