కొత్త సంవత్సరం 2026లో ఈ తులసి వేర్ల పరిహారాన్ని పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు!
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొత్త సంవత్సరం 2026లో ఈ తులసి వేర్ల పరిహారాన్ని పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాస్తు దోషాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే డబ్బు కూడా నిలవక ఇబ్బంది పడుతుంటారు.

అలాంటి వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది. తులసితో చేసే పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. రాహువు ప్రతికూల ప్రభావం తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తులసి పరిహారంతో వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి
తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. తులసి మొక్క ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన ఈ పరిహారాలను పాటించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి వీలవుతుంది.
తులసి వేర్లతో ఇలా చేయండి
తులసి మొక్క వేర్ల వద్ద మట్టిలో ఒక రూపాయి నాణాన్ని పాతిపెట్టండి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఈ పరిహారం శని, రాహుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా హెల్ప్ అవుతుంది.
వాస్తు దోషాలు కూడా సులువుగా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లో ప్రశాంతత కలగడానికి, ఆనందంగా ఉండడానికి తులసి మొక్క వేర్ల వద్ద మట్టిలో నాణాన్ని పాతిపెట్టండి. ఇలా చేస్తే ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా ఎక్కువ అవుతుంది.
ఈ పరిహారాన్ని ఎప్పుడు, ఎలా చేయాలి?
గురువారం లేదా శుక్రవారం నాడు ఇది చేయడం మంచిది. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకున్నాక నాణాన్ని పాతిపెట్టండి. తరువాత రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టండి. ఇలా చేయడం వలన చక్కటి మార్పును చూడొచ్చు.
తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తులసి మొక్కను శీతాకాలంలో చల్లటి గాలుల నుంచి రక్షించుకోవాలి. మట్టి పొడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయాలి. ఇలాంటివి తప్పక పాటించాలి. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండకూడదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


