చదువుపై ఏకాగ్రత పెరగాలంటే.. విద్యార్థులు పాటించాల్సిన 5 జ్యోతిష్య పరిహారాలు!
చదువుపై ఏకాగ్రత లేకపోవడం, చదివిన విషయాలు గుర్తుండకపోవడం వంటి సమస్యలకు కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించవచ్చని ఈ కథనం చెబుతోంది. చదువుకునేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చోవడం వంటి సూచనలు ఇందులో ఉన్నాయి.
ఏకాగ్రతను పెంపొందించేందుకు సులువైన జ్యోతిష్య పరిహారాలు: మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా జ్యోతిష్య పరిహారాలు ఉంటాయి. చాలా మంది చదువులో ఏకాగ్రత పెట్టలేకపోతారు. చదివేయాలని అనుకున్నప్పటికీ, ఏకాగ్రత కారణంగా అనుకున్న వాటిని పూర్తి చేయలేరు. ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి జ్యోతిష్య పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.

చదువు పట్ల ఏకాగ్రతను పెంపొందించేందుకు సులువైన జ్యోతిష్య పరిహారాలు
ఉత్తరం లేదా తూర్పు దిశ:
ప్రతి విద్యార్థి కూడా చదువుపై ఏకాగ్రతను పెట్టడం చాలా అవసరం. కొన్ని సార్లు చదువుకోవడానికి కూర్చోగానే మనసు ఎటో వెళ్లిపోతూ ఉంటుంది. చదివిన విషయాలు గుర్తు ఉండవు. పరీక్షల సమయంలో సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పరిహారాన్ని పాటించండి. చదివేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చుని చదవడం మంచిదే. ఈ దిశగా కూర్చుని చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుచుకోవచ్చు.
గణేశ రుద్రాక్ష:
పరీక్షల్లో విజయాన్ని పొందాలంటే, చదువుపై ఆసక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి గణేశ రుద్రాక్షను ధరించండి. జ్యోతిష్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, దీనిని ధరించడం వలన చదువుపై దృష్టిని పెంచుకోవచ్చు.
చదువుకునే ప్రదేశం శుభ్రంగా ఉండాలి:
చదివేటప్పుడు ప్రదేశం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. శుభ్రమైన వాతావరణంలో మనసు సానుకూలంగా ఉంటుంది. చదివేటప్పుడు పరధ్యానాన్ని తగ్గించడంలో సాయం చేస్తుంది.
చంద్ర మంత్రం:
చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తే కూడా చదువు పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి చంద్రుడికి సంబంధించిన మంత్రాలను చదువుకోండి.
రత్నాలను ధరించండి:
ఒకవేళ రత్నాలను ధరించాలి అనుకుంటే, జాతకం, మీ చేతిలోని రేఖలు చూపించుకుని తగినట్టుగా రత్నాలను ధరిస్తే కూడా బాగా కలిసి వస్తోంది. గ్రహాల స్థితిని బట్టి గురువు, సూర్యుడు, చంద్రుడు లేదా బుధుడికి సంబంధించిన రత్నాలను ధరిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
ఈ దేవుళ్లు, దేవతలను పూజించండి:
మంచి ఫలితాలు, చదువు పట్ల ఆసక్తి కలగాలంటే శివుడు, సరస్వతీ దేవి, వినాయకుడిని పూజించడం మంచిది. వీరిని ఆరాధించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తిని కూడా పెంచుకోవచ్చు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


