2027 సంవత్సరం ప్రారంభంలో గ్రహాల ప్రత్యేక సంచారం పలు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులను తీసుకురానుంది. గురు, శని స్థానాల ప్రభావంతో ఏయే రాశుల వారికి కెరీర్, ఆర్థికపరంగా కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం వచ్చేసింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2027 సంవత్సరం అనేక ముఖ్యమైన గ్రహ గతుల కలయికతో ప్రారంభమవుతోంది. జనవరి 1న దేవగురువు బృహస్పతి సింహ రాశిలో వక్ర స్థితిలో ఉండగా, శని భగవానుడు మీన రాశిలో సంచరించనున్నారు.
జ్యోతిష్యంలో గురుని జ్ఞానం, ధనం, సంతాన సౌభాగ్యాలకుకారకుడిగా భావిస్తే.. శనిని కర్మ, శ్రమ, క్రమశిక్షణకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కొత్త సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. జనవరి 25న గురుడు మళ్లీ కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, రాశి చక్రంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
మేష రాశి:
కొత్త ఏడాది ఆరంభం మేష రాశి వారికి వృత్తిపరంగా అత్యంత కీలకంగా మారనుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. వ్యాపారస్తులకు పాత పరిచయాలు, పాత కస్టమర్ల ద్వారా మంచి లాభాలు ఒనగూడుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా బలపడటాన్ని గమనించవచ్చు.
మిథున రాశి:
మిథున రాశి వారికి 2027 సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయాల్సిరావచ్చు. ఉద్యోగ మార్పును కోరుకునే వారికి అనుకూలమైన సమయం ఇది. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అయితే, ఎలాంటి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
సింహ రాశి:
జనవరి 1న గురుడు ఇదే రాశిలో వక్ర స్థితిలో ఉండటం వల్ల సింహ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనులపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో పూర్వపు బాధ్యతలే మళ్లీ రావచ్చు. సొంత వ్యాపారం చేసే వారికి కొత్త నెట్వర్క్ల ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది.
తులా రాశి:
{{/usCountry}}జనవరి 1న గురుడు ఇదే రాశిలో వక్ర స్థితిలో ఉండటం వల్ల సింహ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనులపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో పూర్వపు బాధ్యతలే మళ్లీ రావచ్చు. సొంత వ్యాపారం చేసే వారికి కొత్త నెట్వర్క్ల ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది.
తులా రాశి:
{{/usCountry}}తులారాశి వారికి నూతన సంవత్సర ఆరంభం ఆర్థిక పరమైన మార్పులను తీసుకువస్తుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు సరికొత్త మార్గాలు గోచరిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీ హోదాను పెంచుతాయి. పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అందే సూచనలున్నాయి.
ధనుస్సు రాశి:
కెరీర్ పరంగా ధనుస్సు రాశి వారికి ఈ కాలం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లేదా ఆశించిన మార్పులు వస్తాయి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు లభించడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది.
మకర రాశి:
మకర రాశికి అధిపతి అయిన శనిదేవుడు మీన రాశిలో సంచరిస్తున్నందున, ఈ రాశి వారికి క్రమశిక్షణ, కఠిన శ్రమే శ్రీరామరక్ష. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో పాత పరిచయాలు లాభసాటిగా మారుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేలా చేసే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి.