Mercury Transit: డిసెంబర్ 27 నుంచి బుధ సంచారంలో మార్పుతో కొన్ని రాశులకు స్వర్ణకాలం.. డబ్బు, సంతోషం ఇలా ఎన్నో!

డిసెంబర్ 27 నుంచి బుధుడు తన దిశను మార్చుకుంటాడు. దక్షిణం వైపుకి పైనుంచి పోతున్నాడు బుధుడు. బుధుడు ఇలా దక్షిణం వైపు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. మరి బుధుని సంచారంతో ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.

Published on: Dec 17, 2025, 13:30:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

Mercury Transit: డిసెంబర్ 27 నుంచి బుధ సంచారంతో మార్పు
Mercury Transit: డిసెంబర్ 27 నుంచి బుధ సంచారంతో మార్పు

మరికొన్ని రోజుల్లో బుధ సంచారం జరగబోతోంది. డిసెంబర్ 27 నుంచి బుధుడు తన దిశను మార్చుకుంటాడు. దక్షిణం వైపుకి పైనుంచి పోతున్నాడు బుధుడు. బుధుడు ఇలా దక్షిణం వైపు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. మరి బుధుని సంచారంతో ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధ సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు

బుధుడు గ్రహాలకు రాజు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం, జ్ఞానం, వాక్కు, చదువు మొదలైన వాటికి కారకుడు. బుధుడు ఎప్పుడైతే తన రాశిని మారుస్తాడో, అప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరో పది రోజుల్లో బుధుడు దక్షిణం వైపు పయనిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది. అదృష్టం కూడా కలిసి రాబోతుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

దక్షిణం వైపుకి బుధ సంచారం.. ఈ రాశుల వారికి లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సంచారం బాగా మేలు చేయబోతోంది. బుధుని సంచారంతో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి విజయాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి రాబోతోంది. బుధ సంచారంలో మార్పు రావడంతో కన్యా రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెడితే విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమస్యలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.

3.తులా రాశి

తులా రాశి వారికి డిసెంబర్ 27 నుంచి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరగడంతో పాటు వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు పెడితే కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More