తామర పువ్వు నుంచి శివలింగం వరకు ఈ 5 వస్తువులు కనిపిస్తే అదృష్టం, ఐశ్వర్యానికి సంకేతమట!
స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కొన్ని కలలను శుభ సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా తామర పువ్వు, తెల్లటి గోవు లేదా పాలు, శివలింగం, చిరునవ్వుతో ఉన్న దుర్గాదేవి, సంతోషంగా కనిపించే పూర్వీకులు కలలో కనిపించడం సానుకూల ఫలితాలకు సంకేతంగా పేర్కొంటారు.
మనిషి నిద్రపోయే సమయంలో రకరకాల కలలను కంటాడు. అయితే అందులో కొన్ని భయపెట్టేవిగా ఉంటే, మరి కొన్ని మనసుకి ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని తీసుకు రావడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక రూపాలు, వస్తువులు కనుక కలలో సాక్షాత్కరిస్తే రాబోయే రోజుల్లో జీవితం సుభిక్షంగా మారుతుందని, కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం వస్తుందని అంటారు.

స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కొన్ని కలలు శుభ ఫలితాలను తీసుకువస్తాయి. కలలో కనిపించే శుభ సంకేతాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం. రాత్రి సమయంలో కనిపించే కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
స్వప్న శాస్త్రంలో కలలో కనిపించే వివిధ సంకేతాల గురించి ప్రస్తావించబడింది. కొన్ని వస్తువులు లేదా కొన్ని రూపాలు కలలో కనిపించినట్లైతే భవిష్యత్తు అందంగా ఉంటుంది. శుభప్రదమైన ఫలితాలను చూడొచ్చు. కలలో కనిపించే ఐదు శుభ సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తామర పువ్వు:
కలలో తామర పువ్వు కనిపిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. తామర పువ్వు సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవికి ఆసనంగా భావిస్తారు. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర పువ్వు కలలో కనపడితే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని స్వప్న శాస్త్రం చెప్తోంది.
తెల్లటి గోవు లేదా పాలు:
కలలో తెల్లటి గోవు లేదా పాలు కనిపిస్తే శుభప్రదంగా భావించాలి. ఈ రెండూ కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. కలలో గోవు కనబడినట్లైతే దేవతల అనుగ్రహం లభిస్తుంది. సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కూడా లభిస్తాయి.
శివలింగం:
కలలో శివలింగం కనిపిస్తే కూడా శుభప్రదంగా భావించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివలింగాన్ని చూస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. భవిష్యత్తులో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంతోషంగా ఉండొచ్చు.
దుర్గాదేవి కలలో కనిపించడం:
దుర్గాదేవి కనబడితే కూడా శుభప్రదంగా భావించాలి. దుర్గాదేవి చిరునవ్వుతో కనిపిస్తే కష్టాలు తొలగిపోయి సమస్యలన్నిటి నుంచి బయటపడొచ్చు. ముఖ్యమైన పనులు విజయాన్ని సాధించడానికి కూడా ఈ కల సంకేతంగా ఉంటుందని స్వప్న శాస్త్రం చెప్తోంది.
సంతోషంగా ఉన్న పూర్వీకులు:
కలలో సంతోషంగా పూర్వీకులు కనిపిస్తే చాలా మంచిది. ఐశ్వర్యం, వంశాభివృద్ధికి సంకేతంగా భావించాలి. వారు సంతోషంగా కనబడితే జీవితంలో కష్టాలు, బాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే వంశాభివృద్ధి కూడా జరుగుతుందట.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


