గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు వస్తే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు యువరాజు అయిన బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు నక్షత్ర సంచారం చేసినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుధ నక్షత్ర సంచారంతో మే నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.
భరణి నక్షత్రంలోకి బుధుడు

భరణి నక్షత్రంలోకి బుధుడు మే 7న అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందబోతున్నారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆస్తులకు సంబంధించిన తగాదాలు తీరి పోతాయి. విజయాలను అందుకుంటారు.
1.మేష రాశి:
మేష రాశి వారికి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు ఉంటాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
2.తులా రాశి:
భరణి నక్షత్రంలోకి బుధుడు అడుగు పెట్టడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్ట్, మీడియా, రైటింగ్ రంగాల వారు విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి తెలివితేటలు పెరుగుతాయి. సక్సెస్ అందుకుంటారు. ఆస్తులకు సంబంధించిన తగాదాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం.
4.మిధున రాశి:
ఈ రాశి వారికి మే నెలలో బుధ నక్షత్ర సంచారంతో బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా లాభాలను చూస్తారు.
{{/usCountry}}ఈ రాశి వారికి మే నెలలో బుధ నక్షత్ర సంచారంతో బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా లాభాలను చూస్తారు.
{{/usCountry}}