మే నెల ప్రారంభం నుంచి నాలుగు రాశుల లైఫ్ అదిరిపోతోంది.. డబ్బు, విజయాలు ఇలా అనేకం!

గ్రహాలకు యువరాజు బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధ క్షత్ర సంచారం చేసినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుధ నక్షత్ర సంచారంతో మే నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది.

Published on: Apr 3, 2026, 14:01:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు వస్తే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు యువరాజు అయిన బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు నక్షత్ర సంచారం చేసినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుధ నక్షత్ర సంచారంతో మే నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.

మే నెల ప్రారంభం నుంచి నాలుగు రాశుల లైఫ్ అదిరిపోతోంది (pinterest)
మే నెల ప్రారంభం నుంచి నాలుగు రాశుల లైఫ్ అదిరిపోతోంది (pinterest)

భరణి నక్షత్రంలోకి బుధుడు

భరణి నక్షత్రంలోకి బుధుడు మే 7న అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందబోతున్నారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆస్తులకు సంబంధించిన తగాదాలు తీరి పోతాయి. విజయాలను అందుకుంటారు.

1.మేష రాశి:

మేష రాశి వారికి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు ఉంటాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

2.తులా రాశి:

భరణి నక్షత్రంలోకి బుధుడు అడుగు పెట్టడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్ట్, మీడియా, రైటింగ్ రంగాల వారు విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.

3.సింహ రాశి:

సింహ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి తెలివితేటలు పెరుగుతాయి. సక్సెస్ అందుకుంటారు. ఆస్తులకు సంబంధించిన తగాదాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం.

4.మిధున రాశి:

రాశి వారికి మే నెలలో బుధ నక్షత్ర సంచారంతో బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా లాభాలను చూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More