...
...
Next Story

అక్టోబర్ 31 నుంచి ధనుస్సు రాశితో సహా ఈ 5 రాశుల వారికి అమేజింగ్ లక్కు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం

అక్టోబర్ నెలాఖరులో సింహరాశిలో శుభ, అశుభ గ్రహాల కలయిక జరగనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉందో తెలుసుకోండి.

Published on: Oct 11, 2026, 19:01:38 IST
Advertisement

గురు గ్రహ స్థానంలో మార్పు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం గురు గ్రహం వృశ్చిక రాశిలో సంచరిస్తోంది. అక్టోబర్ 31న గురు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో అప్పటికే ఆ రాశిలో సంచరిస్తున్న కేతువుతో కలిసి సంచరిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో కేతువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ వక్రగతిలో సంచరించే కేతువు, ఆకస్మిక మార్పులు, రహస్యాలతో ముడిపడి ఉంటుంది. గురు-కేతువులు చాలా సంవత్సరాల తర్వాత సింహ రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులలో కనిపించినప్పటికీ, కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది.

ధనుస్సు రాశి

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ధనుస్సు రాశిలోని తొమ్మిదో ఇంట్లో గురు, కేతువుల కలయిక జరగనుంది. అందువల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే వృత్తిలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు ఊహించని లాభాలు వస్తాయి. ఇప్పటివరకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గురు సంచారం తర్వాత ధన వెల్లువెత్తుతుంది.

మేష రాశి

మేష రాశి వారి ఐదో ఇంట్లో గురు, కేతువుల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి కొత్త ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. కష్టపడి సంపాదించిన డబ్బు చాలా కాలంగా ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే.. అది ఇప్పుడు వారి చేతికి వస్తుంది. మీరు ఊహించని కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు జీతం పెంపుతో పాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందే అవకాశం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి రెండో ఇంట్లో గురు-కేతువుల కలయిక ఏర్పడుతుంది. అందువల్ల కర్కాటక రాశి వారు ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెరగడానికి, పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు దీర్ఘకాలిక కృషి ఫలితంగా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా చేకూరవచ్చు. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.

సింహ రాశి

కన్యారాశి వారికి కేతు-గురు గ్రహ సంచారం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఎక్కడో నిలిచిపోయిన మీ కష్టార్జితం మీ చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks