అక్టోబర్ 9 శుక్రవారం రాశి ఫలాలు: లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశులకు శుభవార్తలు.. ఆర్థిక లాభాలు, కెరీర్‌లో పురోగతి!
హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల గమనంలో మార్పులు 12 రాశులపై ప్రభావం చూపుతాయి.
హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజును లక్ష్మీదేవి పూజకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. చాలా మంది శుక్రవారం ఉదయాన్నే అమ్మవారిని ఆరాధించి తమ రోజును ప్రారంభిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ గ్రహాలు మరియు నక్షత్రాల గమనం మారుతుంటుంది.

దీని ప్రభావం 12 రాశులపై ప్రత్యేకంగా ఉంటుంది. కొందరికి పనులు సజావుగా సాగిపోతే, మరికొందరికి కొత్త బాధ్యతలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో శుభవార్తలు వినడం లేదా ఖర్చులు పెరిగి బడ్జెట్ తలకిందులు కావడం వంటి పరిణామాలు రాశిని బట్టి మారుతుంటాయి. మీ రాశి ప్రకారం శుక్రవారం రోజు మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు సవాళ్లు మరియు అవకాశాల కలయికగా ఉంటుంది. మీ సానుకూల దృక్పథం ఈ రోజు విజయాలను సొంతం చేసుకోవడానికి మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోతాయి. చేపట్టే పనులలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుండటం వల్ల స్మార్ట్ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం.
మిథున రాశి
సాహసం, ఉత్సాహంతో ఈ రోజును ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈ రోజు మీకు ఎంతో శుభప్రదంగా ఉంది. ప్రేమ జీవితం బలంగా, వృత్తి జీవితం సృజనాత్మకంగా సాగిపోతుంది.
కర్కాటక రాశి
ఆరోగ్యం కుదుటపడుతుంది. పని ఒత్తిడిని మీరు ఎంతో సమర్థవంతంగా మరియు సులభంగా ఎదుర్కుంటారు. ఈ రోజు మీరు ఎంతో క్రియేటివ్‌గా ఫీలవుతారు. ఏలాంటి సమస్యలనైనా పరిష్కరించే మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
సింహ రాశి
ప్రస్తుత మీ ఆర్థిక పరిస్థితి మంచి పెట్టుబడి పథకాలను ఎంచుకోవడానికి సహకరిస్తుంది. ఈ రోజు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. మీ పని చేసే ప్రదేశంలో మీకు లభించే విజయాలపట్ల పూర్తి విశ్వాసంతో ఉండండి.
కన్య రాశి
ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దు. చిన్నపాటి ఉత్పాదకత సమస్యలు మీ వృత్తి జీవితంపై పెద్దగా ప్రభావం చూపవు. ఏ పరిస్థితిలోనైనా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ముఖ్యం. బంధాల్లో వచ్చే సమస్యలను సానుకూల పద్ధతిలో పరిష్కరించుకోండి.
తులా రాశి
మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆఫీసులో మీ వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తూ ఉత్పాదకతను కాపాడుకోండి. ధనాన్ని నిర్వహించడంలో కాస్త జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో ఉదర సంబంధించిన కొన్ని చిన్నపాటి సమస్యలు రావచ్చు.
వృశ్చిక రాశి
ప్రేమ వ్యవహారాల్లో మనసు మాట కంటే బుద్ధి మాట వినడం మంచిది. ఆఫీసులో ఈ రోజు మీకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావు. ప్రేమ సంబంధిత విషయాలను సంయలనంతో పరిష్కరించుకోండి, భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపండి.
ధనుస్సు రాశి
వ్యాపారపరంగా ఎదురయ్యే సవాళ్లను మీ శ్రమతో ఎదుర్కొంటారు. ఆర్థిక పరమైన సమస్యలు ఏవీ ఉండవు. మీ ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తంమీద ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా గడుస్తుంది.
మకర రాశి
పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవీ తలెత్తవు, ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. ప్రేమ జీవితంలో వచ్చే వివాదాలను పరిష్కరించుకోవడానికి సరైన మార్గాలను అన్వేషించండి. ఈ రోజు మీ వ్యక్తిగత సంరక్షణ పట్ల శ్రద్ధ పెట్టండి.
కుంభ రాశి
ఆర్థిక పరంగా అభివృద్ధిని, కెరీర్‌లో ఉన్నత అవకాశాలను ఈ రోజు మీరు చూస్తారు. మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువచ్చే కొన్ని ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.
మీన రాశి
ఆఫీసులో మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడం ద్వారా మంచి కెరీర్‌ను సొంతం చేసుకోండి. ఆర్థికంగా ఈ రోజు మీరు చాలా బలమైన స్థితిలో ఉంటారు. మీ దినచర్యను మరింత మెరుగుపరిచే సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


