...
...
Next Story

వినాయకుడిని ప్రసన్నం చేసే శక్తివంతమైన గణపతి తాళం.. మీరెప్పుడైనా విన్నారా? ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

మూడేళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన విభువన సంకష్ట చతుర్థి పర్వదినం ఈ రోజు (బుధవారం) వచ్చింది. ఈ విశిష్టమైన రోజున గణపతి తాళం వినడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Published on: Jun 3, 2026, 12:00:53 IST
Advertisement

వినాయకుడిని ఆరాధించడం వలన పనిలో ఉన్న విఘ్నాలు, అడ్డంకులు తొలగిపోయి విజయవంతంగా మనం వాటిని పూర్తి చేయొచ్చు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధిస్తే మన ప్రయత్నాలు సఫలమవుతాయి. గణపతి తాళం చాలా శక్తివంతమైనది. నిత్యం ఈ తాళం వింటే సానుకూల శక్తులు పెరుగుతాయి. అంతేకాకుండా ఇంకా ఎన్నో లాభాలు పొందవచ్చు.

గణపతి తాళం ఎప్పుడైనా విన్నారా?

వినాయకుడిని ప్రసన్నం చేసే శక్తివంతమైన గణపతి తాళం (pinterest)
వినాయకుడిని ప్రసన్నం చేసే శక్తివంతమైన గణపతి తాళం (pinterest)

గణపతి తాళం వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. సాధారణంగా మనం ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా మొట్టమొదట గణపతిని ఆరాధిస్తూ ఉంటాము. విఘ్నాలను తొలగించే అధిపతి అయినటువంటి వినాయకుడిని కొలుస్తాము. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. అందులో అత్యంత శక్తివంతమైనది ఈ గణపతి తాళం అని చెప్పొచ్చు.

ఈ రోజు బుధవారం. పైగా మూడేళ్లకు ఒకసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి. ఈ పర్వదినాన గణపతి తాళం వింటే ఎంతో మంచి జరుగుతుంది. చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అత్యంత శక్తివంతమైనదే గణపతి తాళం. ఇది చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. మంత్రాల ఉచ్చారణ, విశేషమైన వాయిద్యాల ఆలాపన కలయికతో ఈ తాళం ఉంటుంది. ఇది చాలా ప్రశాంతతను అందిస్తుంది. ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది.

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి

విద్యార్థులు రోజు గణపతి తాళం వింటే ఔషధంలా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. విద్యార్థులు చదవడానికి ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి ముందు కొన్ని నిమిషాల పాటు దీనిని వింటే మంచిది. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.

ప్రతికూల శక్తి తగ్గుతుంది

ఇంట్లో లేదా ఆఫీస్‌లో అప్పుడప్పుడు ఒత్తిడి, నిరాశ, ప్రతికూల వాతావరణం కలుగుతాయి. అలాంటప్పుడు గణపతి తాళం వింటే మనసులో సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తగ్గుతుంది. ఉదయం లేదా సాయంత్రం పూట ఈ తాళాన్ని ఇంట్లో ఒకసారి ప్లే చేయండి. ఇల్లంతా కూడా సానుకూల శక్తితో నిండిపోతుంది.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది

చాలా మంది ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు లేదా ఇతర పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమయంలో వినాయకుని అనుగ్రహం ఉంటే సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు గణపతి తాళం వింటే పనుల్లో ఆటంకాలు తొలగి విజయాన్ని అందుకోవచ్చు. ఇలా గణపతి తాళం వినడం వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వినాయకుని ఆశీస్సులు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు వింటే మంచిది.

ఈ తాళాన్ని ఎలా పఠించాలి?

ఈ తాళాన్ని పఠించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఉదయం లేదా సాయంత్రం పూట పూజా గదిలో దీపం పెట్టి, ప్రశాంతమైన మనసుతో ఈ తాళాన్ని చదవాలి. చేతులతో లయ వేస్తూ కూడా దీనిని పఠించొచ్చు. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూడా దీనిని చదివితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe