ప్రస్తుతం పోటీ ప్రపంచ. నిరంతర ఒత్తిడి. ఇలాంటప్పుడు భగవద్గీత బోధనలు మనల్ని ధర్మబద్ధమైన, అర్థవంతమైన జీవితం గడపడానికి మార్గనిర్దేశం చేస్తాయి. జెన్ జెడ్ ఈ బోధనలను నిజంగా ఆచరిస్తే.. అవి వారిని ప్రశాంతమైన, బలమైన, శాంతియుతమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడతాయి. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం మాత్రమే అనుకోకూడదు. జీవిత పాఠాలను నేర్పుతుంది. భగవద్గీత వేల సంవత్సరాలుగా ప్రజలకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తోంది. చాలా మంది తమ జీవితాల్లోని సమస్యలకు భగవద్గీత ద్వారా పరిష్కారాలను కనుక్కుంటారు.

జెన్ జెడ్‌లో జన్మించిన వారికి భగవద్గీత చాలా అవసరం. నిజానికి అందరికీ ఇది చాలా ముఖ్యమైనది. ఈ తరం వారి జీవితాల్లో సమస్యల సముద్రాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఒత్తిడిని చూస్తున్నారు. జెన్ జెడ్ తరానికి భగవద్గీత ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మీరే చూడండి.
పనిపై ఫోకస్
చేసే ప్రతి పని నుండి వెంట వెంటనే రిజల్ట్ రావాలని ఆశించే ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ చేసిన పనికి రేపే ఫలితం ఆశీస్తున్నారు యువత. ఆశించిన ఆ ఫలితాల మీద అత్యాశలో ఒత్తిడికి, పనిభారానికి గురవుతాం. పనులు అనుకున్నట్లు జరగనప్పుడు.. నిరాశ చెందుతాం. ఫలితాల మీద కాకుండా మన కర్తవ్యాల మీద దృష్టి పెట్టాలని శ్రీకృష్ణుడు మనకు ఒక పాఠం చెబుతాడు. మనం మన పనిని నిజాయితీతో, కఠోర శ్రమతో, పట్టుదలతో చేయాలని చెప్పాడు. ఇది గొప్ప సంతృప్తిని ఇస్తుంది. శాంతిని చేకూర్చి, అనవసరమైన ఒత్తిడి నుండి విముక్తిని దొరుకుతుంది.
మార్పు కచ్చితం
మార్పు కష్టమైనది, కానీ దానిని ఎవరూ సులభంగా ఇష్టపడరు. జీవితంలో మార్పు శాశ్వతమని అర్థం చేసుకోవాలి. ఏ విషయం జీవితాంత ఒకేలా ఉండదు. మార్పు బాధాకరమైనప్పటికీ మనల్ని మరింత మంచి వైపునకు నడిపిస్తుంది. మార్పులు మనల్ని మరింత బలవంతులుగా చేస్తాయి. మార్పునకు అనుగుణంగా మారి దానిని అంగీకరించడం ఎలాగో నేర్పిస్తాయి. కొన్నిసార్లు మార్పు అవకాశాలను తెస్తుంది, మరికొన్నిసార్లు పాఠాలను నేర్పుతుంది. అంతర్గత శాంతి కావాలంటే.. మార్పును అంగీకరించాలి.
బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి
జీవితంలోని ప్రతి అంశంలో సమతుల్యతను పాటించాలి. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో క్రమశిక్షణతో కూడిన, సమతుల్యమైన జీవితాన్ని గడపడమే విజయానికి అతిపెద్ద కీలక విషయాలలో ఒకటి. మనం చేసే ప్రతి పనిలో సమతుల్యతను పాటించినప్పుడు విజయం సులభంగా దొరుకుతుంది.
ప్రస్తుతంలో జీవించండి
{{/usCountry}}జీవితంలోని ప్రతి అంశంలో సమతుల్యతను పాటించాలి. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో క్రమశిక్షణతో కూడిన, సమతుల్యమైన జీవితాన్ని గడపడమే విజయానికి అతిపెద్ద కీలక విషయాలలో ఒకటి. మనం చేసే ప్రతి పనిలో సమతుల్యతను పాటించినప్పుడు విజయం సులభంగా దొరుకుతుంది.
ప్రస్తుతంలో జీవించండి
{{/usCountry}}వందలో 99 మంది ఫ్యూచర్ గురించి భయంతో ఉంటారు. ఒకవేళ నేను పరీక్షలో ఫెయిల్ అయితే.., ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రాకపోతే.. అనే ఆలోచనలు జెన్ జెడ్ తరం వారి ప్రశాంతతను పాడుచేస్తున్నాయి. మనం వర్తమానంలో జీవించినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిరంతరం భవిష్యత్తు గురించి చింతించడం మన మనసును కలవరపరుస్తుంది. వర్తమానంలో జీవించాలి, ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నమ్మాలి. మీరు గతాన్ని గానీ, భవిష్యత్తును గానీ నియంత్రించలేరు. వర్తమానాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.
సహనం ఉండాలి
జెన్ జెడ్ తరం వారు క్షమ, సహనం వంటి గుణాలను అలవర్చుకోవడం వల్ల కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీటి గురించి కృష్ణుడు గొప్పగా బోధిస్తున్నాడు. కోపంలో తమను తామే బాధించుకుంటారు, ఆ తర్వాత ఇతరులకు లేదా మరేదైనా పరిస్థితికి విచారం కలిగించే నిర్ణయాలు తీసుకుంటారు. క్షమను అలవర్చుకోవడం మన హృదయాల్లో మోస్తున్న భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అంతర్గత శాంతిని చేకూరుస్తుంది. బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది.ేే
ఓవర్ థింకింగ్
జెన్ జెడ్ యువత చేసే అతిపెద్ద తప్పు అతిగా ఆలోచించడం. మనం ప్రతీదాన్నీ, మన దృష్టికి అర్హత లేని విషయాలను కూడా విశ్లేషిస్తూ ఉంటాం. ధ్యానం, జాగరూకతతో కూడిన ఆలోచనల ద్వారా మన మనసుకు శిక్షణ ఇస్తే, మనం మరింత శాంతిని అనుభవించగలం. మన లక్ష్యాలపై ఫోకస్ చేస్తాం. జీవితాన్ని పాడు చేసే ఏ విషయాన్ని అతిగా ఆలోచించకూడదు.