జెన్ జెడ్ కోసం భగవద్గీతలోని ముఖ్యమైన విషయాలు.. కచ్చితంగా మీకు అవసరం

జెన్ జెడ్ యువత చాలా ఫాస్ట్ ఉన్నారు. కానీ కొన్ని విషయాలను తప్పకుండా నేర్చుకోవాలి, భగవద్గీత బోధించే అంశాలను జీవితానికి అలవర్చుకోవాలి.

Published on: Jul 8, 2026, 17:25:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం పోటీ ప్రపంచ. నిరంతర ఒత్తిడి. ఇలాంటప్పుడు భగవద్గీత బోధనలు మనల్ని ధర్మబద్ధమైన, అర్థవంతమైన జీవితం గడపడానికి మార్గనిర్దేశం చేస్తాయి. జెన్ జెడ్ ఈ బోధనలను నిజంగా ఆచరిస్తే.. అవి వారిని ప్రశాంతమైన, బలమైన, శాంతియుతమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడతాయి. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం మాత్రమే అనుకోకూడదు. జీవిత పాఠాలను నేర్పుతుంది. భగవద్గీత వేల సంవత్సరాలుగా ప్రజలకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తోంది. చాలా మంది తమ జీవితాల్లోని సమస్యలకు భగవద్గీత ద్వారా పరిష్కారాలను కనుక్కుంటారు.

భగవద్గీత (HT Telugu)
భగవద్గీత (HT Telugu)

జెన్ జెడ్‌లో జన్మించిన వారికి భగవద్గీత చాలా అవసరం. నిజానికి అందరికీ ఇది చాలా ముఖ్యమైనది. ఈ తరం వారి జీవితాల్లో సమస్యల సముద్రాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఒత్తిడిని చూస్తున్నారు. జెన్ జెడ్ తరానికి భగవద్గీత ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మీరే చూడండి.

పనిపై ఫోకస్

చేసే ప్రతి పని నుండి వెంట వెంటనే రిజల్ట్ రావాలని ఆశించే ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ చేసిన పనికి రేపే ఫలితం ఆశీస్తున్నారు యువత. ఆశించిన ఆ ఫలితాల మీద అత్యాశలో ఒత్తిడికి, పనిభారానికి గురవుతాం. పనులు అనుకున్నట్లు జరగనప్పుడు.. నిరాశ చెందుతాం. ఫలితాల మీద కాకుండా మన కర్తవ్యాల మీద దృష్టి పెట్టాలని శ్రీకృష్ణుడు మనకు ఒక పాఠం చెబుతాడు. మనం మన పనిని నిజాయితీతో, కఠోర శ్రమతో, పట్టుదలతో చేయాలని చెప్పాడు. ఇది గొప్ప సంతృప్తిని ఇస్తుంది. శాంతిని చేకూర్చి, అనవసరమైన ఒత్తిడి నుండి విముక్తిని దొరుకుతుంది.

మార్పు కచ్చితం

మార్పు కష్టమైనది, కానీ దానిని ఎవరూ సులభంగా ఇష్టపడరు. జీవితంలో మార్పు శాశ్వతమని అర్థం చేసుకోవాలి. ఏ విషయం జీవితాంత ఒకేలా ఉండదు. మార్పు బాధాకరమైనప్పటికీ మనల్ని మరింత మంచి వైపునకు నడిపిస్తుంది. మార్పులు మనల్ని మరింత బలవంతులుగా చేస్తాయి. మార్పునకు అనుగుణంగా మారి దానిని అంగీకరించడం ఎలాగో నేర్పిస్తాయి. కొన్నిసార్లు మార్పు అవకాశాలను తెస్తుంది, మరికొన్నిసార్లు పాఠాలను నేర్పుతుంది. అంతర్గత శాంతి కావాలంటే.. మార్పును అంగీకరించాలి.

బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి

జీవితంలోని ప్రతి అంశంలో సమతుల్యతను పాటించాలి. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో క్రమశిక్షణతో కూడిన, సమతుల్యమైన జీవితాన్ని గడపడమే విజయానికి అతిపెద్ద కీలక విషయాలలో ఒకటి. మనం చేసే ప్రతి పనిలో సమతుల్యతను పాటించినప్పుడు విజయం సులభంగా దొరుకుతుంది.

ప్రస్తుతంలో జీవించండి

వందలో 99 మంది ఫ్యూచర్ గురించి భయంతో ఉంటారు. ఒకవేళ నేను పరీక్షలో ఫెయిల్ అయితే.., ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రాకపోతే.. అనే ఆలోచనలు జెన్ జెడ్ తరం వారి ప్రశాంతతను పాడుచేస్తున్నాయి. మనం వర్తమానంలో జీవించినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిరంతరం భవిష్యత్తు గురించి చింతించడం మన మనసును కలవరపరుస్తుంది. వర్తమానంలో జీవించాలి, ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నమ్మాలి. మీరు గతాన్ని గానీ, భవిష్యత్తును గానీ నియంత్రించలేరు. వర్తమానాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.

సహనం ఉండాలి

జెన్ జెడ్ తరం వారు క్షమ, సహనం వంటి గుణాలను అలవర్చుకోవడం వల్ల కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీటి గురించి కృష్ణుడు గొప్పగా బోధిస్తున్నాడు. కోపంలో తమను తామే బాధించుకుంటారు, ఆ తర్వాత ఇతరులకు లేదా మరేదైనా పరిస్థితికి విచారం కలిగించే నిర్ణయాలు తీసుకుంటారు. క్షమను అలవర్చుకోవడం మన హృదయాల్లో మోస్తున్న భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అంతర్గత శాంతిని చేకూరుస్తుంది. బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది.ేే

ఓవర్ థింకింగ్

జెన్ జెడ్ యువత చేసే అతిపెద్ద తప్పు అతిగా ఆలోచించడం. మనం ప్రతీదాన్నీ, మన దృష్టికి అర్హత లేని విషయాలను కూడా విశ్లేషిస్తూ ఉంటాం. ధ్యానం, జాగరూకతతో కూడిన ఆలోచనల ద్వారా మన మనసుకు శిక్షణ ఇస్తే, మనం మరింత శాంతిని అనుభవించగలం. మన లక్ష్యాలపై ఫోకస్ చేస్తాం. జీవితాన్ని పాడు చేసే ఏ విషయాన్ని అతిగా ఆలోచించకూడదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More