ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు.. ఎల్లప్పుడూ జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు పొందుతారు!
న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపులు. వీరి వెంట అదృష్టం ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బుకి కూడా లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
న్యూమరాలజీ (Numerology) ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపులు. వీరి వెంట అదృష్టం ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బుకి కూడా లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు.

పుట్టిన సంఖ్యతో ప్రతి ఒక్క మనిషికి కూడా దృఢమైన సంబంధం ఉంటుంది. ఒక మనిషి గురించి పుట్టిన తేదీ చాలా విషయాలను చెప్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపులు, పైగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకి కూడా లోటు ఉండదు, మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
రాడిక్స్ నెంబర్ 6:
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు (venus) ధనం, ప్రేమ, సంపద, విలాసాలు మొదలైన వాటికే కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. పైగా వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. డబ్బుకి లోటు ఉండదు, సంపదతో సంతోషంగా ఉంటారు.
వీరి జీవితం ఎలా ఉంటుంది?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అందంగా ఉంటారు, ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటారు. కేవలం వీరే కాదు, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా అదృష్టవంతులే.
ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. పైగా ప్రశాంతంగా, సెన్సిటివ్‌గా ఉంటారు. ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండే వీరు అందరి మనసును దోచుకుంటారు. అయితే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు.
ఈ రంగాల్లో సక్సెస్ అందుకుంటారు:
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆర్ట్స్, మ్యూజిక్, ఫ్యాషన్, డాన్స్, డిజైన్ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, సులువుగా సక్సెస్‌ను అందుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


