జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో ఏదో ఒక ప్రభావం పడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడు తాజాగా శనిదేవుడికి చెందిన నక్షత్రంలోకి అడుగుపెట్టాడు.

హిందూ పంచాంగం ప్రకారం… జూలై 20వ తేదీన ఉదయం 11:33 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం సూర్యుడు, శనిదేవుల మధ్య తండ్రీకొడుకుల సంబంధం ఉంటుంది. ఇప్పుడు శనికి చెందిన పుష్య నక్షత్రంలో సూర్యుడి ప్రయాణం ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 14 రోజుల పాటు శని-సూర్యుల ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా కన్య, తులా, మకరం, వృషభ రాశుల జాతకులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ప్రకాశించడమే కాకుండా…. ఈ 14 రోజులు వీరికి ఎంతో అనుకూలంగా మారనున్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి….
కన్యా రాశి :
శని యొక్క పుష్య నక్షత్రంలో సూర్య సంచారం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీకు ధన యోగం పడుతుంది. ఆర్థిక పరంగా ఊహించని ప్రయోజనాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు విద్యకు సంబంధించిన కొన్ని తీపి కబుర్లు అందుతాయి. మొత్తంగా ఈ సమయం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి :
తులారాశి వారికి కూడా ఈ నక్షత్ర మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆస్తి, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరు, చాకచక్యం మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. సమాజంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
మకర రాశి :
{{/usCountry}}తులారాశి వారికి కూడా ఈ నక్షత్ర మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆస్తి, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరు, చాకచక్యం మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. సమాజంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
మకర రాశి :
{{/usCountry}}శని అధిపతిగా ఉండే మకర రాశి వారికి ఈ సమయం ఎంతో మంగళకరమైనది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి సహోద్యోగులు, భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వారి సేవ చేయడం వల్ల మీ ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
వృషభ రాశి :
వృషభ రాశి వారికి ఈ సంచారం చాలా సానుకూల మార్పులను తెస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో తమ ప్రతిభను చాటుకుని, ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ మార్గాలు సుగమమై, ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు.