మనిషి జీవితాన్ని ప్రభావితం చేయడంలో నవగ్రహాల పాత్ర చాలా కీలకం. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే ఎలాంటి ప్రయత్నంలోనైనా విజయాలు సాధించవచ్చు. అదే సమయంలో గ్రహాల సంచారం అనుకూలించకపోతే కెరీర్, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం నీటితో చేసే కొన్ని సులభమైన పరిహారాల ద్వారా ఈ గ్రహ దోషాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సూర్యుడు, చంద్రుడి దోషాలకు నీటి నివారణలు

జాతకంలో సూర్య భగవానుడి అనుగ్రహం లేకపోతే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. దీని కోసం ప్రతిరోజూ ఉదయమే రాగి పాత్రలోని నీటిలో ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత లోపించినప్పుడు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతే చంద్ర దోషం ఉన్నట్లు భావించాలి. ప్రతి సోమవారం శివలింగానికి పాలు, కొద్దిగా తెల్లని పువ్వులు కలిపిన జలాన్ని అభిషేకం చేయడం ద్వారా మనసు కుదుటపడుతుంది.
గురు, బుధ గ్రహాల అనుగ్రహం కోసం
చదువు, వివాహం, కెరీర్ పరంగా నిత్యం అడ్డంకులు ఎదురవుతుంటే గురు దోషం కారణం కావచ్చు. దీని నివారణకు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. ముఖ్యంగా గురువారం రోజు ఈ పరిహారం ఆచరించడం వల్ల అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇక వ్యాపారంలో రాణించడానికి, వాక్శుద్ధి పెరగడానికి బుధవారం తులసి మొక్కకు ఒక చెంబు శుద్ధమైన నీటిని సమర్పించడం ఉత్తమం.
శుక్రుడు, శని, కుజుడి ప్రసన్నతకు మార్గాలు
వైవాహిక జీవితంలో గొడవలు, ఇబ్బందులు ఉంటే శుక్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ కలుపుకోవడం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది. అలాగే శని, కుజ దోషాలతో బాధపడేవారు దారిలో వెళ్లే బాటసారులకు, పేదలకు దాహం తీర్చడానికి మంచి నీటిని అందించాలి. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు.
రాహు-కేతువుల దుష్ప్రభావాల నివారణ
జీవితంలో ఊహించని సమస్యలు చుట్టుముడితే అది రాహు-కేతువుల ప్రభావం కావచ్చు. రాహు దోషం తొలగిపోవడానికి ఒక పాత్రలో నీరు పోసి ఇంటి బయట ఉంచి, ఆ నీటిని కుక్కకు తాగించాలి. అలాగే కేతువు అనుగ్రహం కోసం పూజా మందిరంలో ఇష్ట దైవం ముందు ఒక చెంబు నీరు ఉంచి, కొంత సమయం తర్వాత ఆ నీటిని సేవించాలి. భక్తి శ్రద్ధలతో చేసే ఈ చిన్న ఉపాయాలు జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి.
{{/usCountry}}జీవితంలో ఊహించని సమస్యలు చుట్టుముడితే అది రాహు-కేతువుల ప్రభావం కావచ్చు. రాహు దోషం తొలగిపోవడానికి ఒక పాత్రలో నీరు పోసి ఇంటి బయట ఉంచి, ఆ నీటిని కుక్కకు తాగించాలి. అలాగే కేతువు అనుగ్రహం కోసం పూజా మందిరంలో ఇష్ట దైవం ముందు ఒక చెంబు నీరు ఉంచి, కొంత సమయం తర్వాత ఆ నీటిని సేవించాలి. భక్తి శ్రద్ధలతో చేసే ఈ చిన్న ఉపాయాలు జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి.
{{/usCountry}}