ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మెుదలయ్యే వ్యక్తులకు వివాహం తర్వాత టైమ్ కలిసి వస్తుంది!

చాలా మంది తమ పేరులోని అక్షరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కింద చెప్పే నాలుగు అక్షరాలతో పేరు మెుదలయ్యే వ్యక్తులకు పెళ్లి తర్వాత కాలం కలిసి వస్తుంది. ఆ అక్షరాలు ఏంటో చూడండి.

Published on: Jul 23, 2026, 16:00:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత ఇద్దరి జీవితం, అదృష్టం, భవిష్యత్తు పెనవేసుకుపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరానికీ, వారి జీవితంలోని ఒడిదుడుకులకూ మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. పెళ్లికి ముందు కొందరు ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. కానీ పెళ్లి తర్వాత వారి జీవితంలో మంచి రోజులు మెుదలవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం A, S, M, R అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు వివాహం తర్వాత ప్రత్యేకంగా అదృష్టవంతులు అవుతారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఏ అక్షరం

ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారు పుట్టుకతోనే కష్టపడేవారు. కానీ చాలాసార్లు వారికి ఆశించిన ప్రతిఫలం లభించదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహం తర్వాత వారి జీవితాలు ఒక పెద్ద మలుపు తీసుకుంటాయి. వారి జీవిత భాగస్వామి అదృష్ట ప్రభావం వల్ల వారు తమ వృత్తిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడి, సమాజంలో ఉన్నత హోదా, గౌరవాన్ని పొందుతారు.

ఎస్ అక్షరం

ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారు చాలా ప్రేమగా, శ్రద్ధగా ఉంటారు. వారి జీవితంలోకి భాగస్వామి రాక వారిలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. వివాహం తర్వాత వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వారి భాగస్వామి ఒక అదృష్ట చిహ్నం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతమవుతాయి. వ్యాపారంలో వారికి ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి.

ఎం అక్షరం

ఎం అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా తెలివైనవారు. కానీ కొన్నిసార్లు వారు నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అయితే వివాహం తర్వాత వారి జీవిత భాగస్వామి మద్దతుతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వారు తమ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటారు. వివాహం తర్వాత వృత్తి, వ్యాపారాలలో గొప్ప విజయాలు సాధిస్తారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

ఆర్ అక్షరం

ఆర్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు మరింత ఆశయాలు, సృజనాత్మకత కలిగి ఉంటారు. కలలు గొప్పవి. వివాహం తర్వాత వారి జీవితంలో స్థిరత్వం, స్పష్టత వస్తాయి. జీవిత భాగస్వామి రాక వారి అదృష్టానికి ద్వారాలు తెరుస్తుంది. సమాజంలో కీర్తి పెరగడంతో పాటు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధించే శక్తిని కలిగి ఉంటారు.

ఒక వ్యక్తి విజయం చాలా వరకు వారి కృషి, విద్య, క్రమశిక్షణ, మంచి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సంతోషకరమైన వైవాహిక జీవితం పరస్పర నమ్మకం, గౌరవం, అవగాహనపై ఉండనుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇద్దరు వ్యక్తుల జాతకాలు, గ్రహ స్థానాల కలయిక వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More